Sagalaabaraadhamu shamiyimchugovayya

సకలాపరాధము శమియించుకోవయ్య
Language

(॥పల్లవి॥)
సకలాపరాధము శమియించుకోవయ్య
అకలంకమైన నీ యానతిలో దానను

(॥సకలా॥)
చేరి నీ పాదములకు సేవ సేసే నంటినా
నేరుపులు నీ వెరంగనివి లేవు
యేరీతి నైనాను చేయెత్తి మొక్కే నంటినా
కారాణాలు నీ విన్నీఁ గాననవి గావు

(॥సకలా॥)
మన సిచ్చి నోతోను మాట లాడే నంటినా
వెనక ముందర నీకు వింత గాదు
చనవు మెరసి నీసరుస నుండే నంటినా
వినికిగా నీవు తొల్లి విననిది గాదు

(॥సకలా॥)
గక్కనఁ గాఁగిట నిన్ను గరఁగించే నంటినా
యిక్కువల నీకు నిది యెరవు గాదు
చిక్కి నన్నుఁ గూడితివి శ్రీవెంకటేశ్వర నేఁడు
పెక్కుసుద్దు లెల్ల నీకు భేదము గాదూ

(||pallavi||)
sagalābarādhamu śhamiyiṁchugovayya
agalaṁkamaina nī yānadilo dānanu

(||sagalā||)
seri nī pādamulagu seva sese naṁṭinā
nerubulu nī vĕraṁganivi levu
yerīdi nainānu seyĕtti mŏkke naṁṭinā
kārāṇālu nī vinnīm̐ gānanavi gāvu

(||sagalā||)
mana sichchi nodonu māḍa lāḍe naṁṭinā
vĕnaga muṁdara nīgu viṁta gādu
sanavu mĕrasi nīsarusa nuṁḍe naṁṭinā
vinigigā nīvu tŏlli vinanidi gādu

(||sagalā||)
gakkanam̐ gām̐giḍa ninnu garam̐giṁche naṁṭinā
yikkuvala nīgu nidi yĕravu gādu
sikki nannum̐ gūḍidivi śhrīvĕṁkaḍeśhvara nem̐ḍu
pĕkkusuddu lĕlla nīgu bhedamu gādū