Sagala balambulu neeve sarveshvara naagu

సకల బలంబులు నీవే సర్వేశ్వర నాకు
Language

(॥పల్లవి॥)
సకల బలంబులు నీవే సర్వేశ్వర నాకు
అకలంకంబగు సుఖమే అన్నిట నిదే నాకు

(॥సక॥)
పొందుగఁ జక్రాంకితమే బుజబలమిదె నాకు
అందిన హరి నీచింతే ఆత్మబలము నాకు
సందడిఁ బేరుబలము కేశవనామము నాకు
యిందును నందును భవభయ మిఁక లేదిదే నాకు

(॥సక॥)
అంగపుఁ దిరుమణు లివి పంచాంగబలము నాకు
సంగతి నీపై పాటలె స్వరబలిమిదే నాకు
రంగుగ నీగుణరాసులే రాసిబలము నాకు
యింగితముగ నిహపరముల కెదురేదిదే నాకు

(॥సక॥)
కనుఁగొను నీవిగ్రహమే గ్రహబలిమిదె నాకు
విను నీదాసుల సేవే వెనుబలిమిదె నాకు
తనరిన శ్రీవేంకటపతి దైవబలము నాకు
ఘనమే చెప్పఁగ నింతటఁ గలిగెబో యిదే నాకు

(||pallavi||)
sagala balaṁbulu nīve sarveśhvara nāgu
agalaṁkaṁbagu sukhame anniḍa nide nāgu

(||saga||)
pŏṁdugam̐ jakrāṁkidame bujabalamidĕ nāgu
aṁdina hari nīsiṁte ātmabalamu nāgu
saṁdaḍim̐ berubalamu keśhavanāmamu nāgu
yiṁdunu naṁdunu bhavabhaya mim̐ka ledide nāgu

(||saga||)
aṁgabum̐ dirumaṇu livi paṁchāṁgabalamu nāgu
saṁgadi nībai pāḍalĕ svarabalimide nāgu
raṁguga nīguṇarāsule rāsibalamu nāgu
yiṁgidamuga nihabaramula kĕduredide nāgu

(||saga||)
kanum̐gŏnu nīvigrahame grahabalimidĕ nāgu
vinu nīdāsula seve vĕnubalimidĕ nāgu
tanarina śhrīveṁkaḍabadi daivabalamu nāgu
ghaname sĕppam̐ga niṁtaḍam̐ galigĕbo yide nāgu