Sadurulainavaarigi saravulu delusunu

చతురులైనవారికి సరవులు దెలుసును
Language

(॥పల్లవి॥)
చతురులైనవారికి సరవులు దెలుసును
కతవలె విచ్చిపలుకఁగ నెట్టు వచ్చునే

(॥చతు॥)
వలపులోపలిచేఁగ వదలని అడియాస
తలఁపులోపలి తరితీపు
పలుకులోపలి మేలు పచ్చికొసరులమాట
చెలువులోపలిమించు సిగ్గుతోడినగవు

(॥చతు॥)
పాయపుఁ బరిణామము పైకొన్నసరసము
కాయపుసోంపులపస గరగరిక
చాయలమొగముకళ చక్కనివాఁడిచూపు
ఆయములోపలిఆయ మంటుకొన్నకోరిక

(॥చతు॥)
కూటమిగలసోబగు గుదిగొన్నతమకము
మాటలలోనివేడుక మంతనము
పాటించి యలమేల్‌మంగపతి శ్రీవేంకటేశుఁడు
నాటినేటిసుద్దులివి ననుపులోననుపు

(||pallavi||)
sadurulainavārigi saravulu dĕlusunu
kadavalĕ vichchibalugam̐ga nĕṭṭu vachchune

(||sadu||)
valabulobalisem̐ga vadalani aḍiyāsa
talam̐pulobali taridību
palugulobali melu pachchigŏsarulamāḍa
sĕluvulobalimiṁchu siggudoḍinagavu

(||sadu||)
pāyabum̐ bariṇāmamu paigŏnnasarasamu
kāyabusoṁpulabasa garagariga
sāyalamŏgamugaḽa sakkanivām̐ḍisūbu
āyamulobaliāya maṁṭugŏnnagoriga

(||sadu||)
kūḍamigalasobagu gudigŏnnadamagamu
māḍalaloniveḍuga maṁtanamu
pāḍiṁchi yalamel‌maṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
nāḍineḍisuddulivi nanubulonanubu