చదురంగ మాడుమని సాదించేవు నేఁడు నన్ను
(॥పల్లవి॥)
చదురంగ మాడుమని సాదించేవు నేఁడు నన్ను
కదియఁగఁగలఁ గాక కయ్యానకుఁ గలవా
(॥చదు॥)
మలసి నీతో మంచిమాఁట లాడఁగలఁ గాక
కెలన బొమ్మలను జంకించఁగలనా
పలపులు చల్లుతా నీవద్ద నుండఁగలఁ గాక
వెలినుండగాఁ దెరవేసుకొనఁగలనా
(॥చదు॥)
సన్నలను నీమోవి చవిగొనఁగలఁ గాక
చెన్నుమీర నది గంటిసేయఁగలనా
అన్నిటా నీకుఁ జుట్టమనై యుండగలఁగాక
పన్నుక నీవు నేనని పందే లాడఁగలనా
(॥చదు॥)
మంతనపురతి నిన్ను మరిగించఁగలఁ గాక
వంతులరతుల గెలువఁగఁ గలనా
యింతలో శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
సంతోషించఁగలఁ గాక చలపట్టఁగలనా
(||pallavi||)
saduraṁga māḍumani sādiṁchevu nem̐ḍu nannu
kadiyam̐gam̐galam̐ gāga kayyānagum̐ galavā
(||sadu||)
malasi nīdo maṁchimām̐ṭa lāḍam̐galam̐ gāga
kĕlana bŏmmalanu jaṁkiṁcham̐galanā
palabulu salludā nīvadda nuṁḍam̐galam̐ gāga
vĕlinuṁḍagām̐ dĕravesugŏnam̐galanā
(||sadu||)
sannalanu nīmovi savigŏnam̐galam̐ gāga
sĕnnumīra nadi gaṁṭiseyam̐galanā
anniḍā nīgum̐ juṭṭamanai yuṁḍagalam̐gāga
pannuga nīvu nenani paṁde lāḍam̐galanā
(||sadu||)
maṁtanaburadi ninnu marigiṁcham̐galam̐ gāga
vaṁtularadula gĕluvam̐gam̐ galanā
yiṁtalo śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
saṁtoṣhiṁcham̐galam̐ gāga salabaṭṭam̐galanā