(॥పల్లవి॥)
సతులకుఁ బతులకు సహజమిది
తతెరిఁగి యెవ్వరికిఁ దప్పించుకో వసమా
(॥॥)
వలపే చక్కఁ దనము వర్ణించి చూచితేను
వలపే సింగారమై వన్నె కెక్కును
వలపే చుట్టురికమై వాడిక సేయుచు నుండు
వలుపే చవులు సేయు వడిఁ దరితీపులు
(॥॥)
జవ్వనమే చెలువమై సరసములాడించు
జవ్వనమే భోగమై యాసలురేఁచును
జవ్వనమే పొంతనాలై జంటలుగాఁ బెనఁగించు
జవ్వనమే వేడుకలై సారెఁ దగిలించును
(॥॥)
ఇచ్చకమే మూలధన మెడయని పొందులకు
ఇచ్చకమే రతులకు నెలయింపులు
ఇచ్చల నలమేల్మంగ నేలిన శ్రీవేంకటేశ
ఇచ్చకమే మోహనమై ఇంపులు వుట్టించును
(||pallavi||)
sadulagum̐ badulagu sahajamidi
tadĕrim̐gi yĕvvarigim̐ dappiṁchugo vasamā
(||||)
valabe sakkam̐ danamu varṇiṁchi sūsidenu
valabe siṁgāramai vannĕ kĕkkunu
valabe suṭṭurigamai vāḍiga seyusu nuṁḍu
valube savulu seyu vaḍim̐ daridībulu
(||||)
javvaname sĕluvamai sarasamulāḍiṁchu
javvaname bhogamai yāsalurem̐sunu
javvaname pŏṁtanālai jaṁṭalugām̐ bĕnam̐giṁchu
javvaname veḍugalai sārĕm̐ dagiliṁchunu
(||||)
ichchagame mūladhana mĕḍayani pŏṁdulagu
ichchagame radulagu nĕlayiṁpulu
ichchala nalamelmaṁga nelina śhrīveṁkaḍeśha
ichchagame mohanamai iṁpulu vuṭṭiṁchunu