Sadulagum badulagu saajamu livi

సతులకుఁ బతులకు సాజము లివి
Language

(॥పల్లవి॥)
సతులకుఁ బతులకు సాజము లివి
సతమాయ వేడుకలు సరసము లాడవే

(॥సతు॥)
తలపోతఁ లన్నియును తగులైనందాఁకనే
చలము పయ్యదకొంగు జారుదాఁకనే
నలువంక కసరులు నవ్వినయందాఁకనే
బలిమి యంతటి మీఁదఁ బచరించఁదగదు

(॥సతు॥)
మొనసిన గుంపెనలు మొక్కినయందాఁకనే
చెనకులు కొనగోరఁ జిమ్ముదాఁకానే
తనివోని యాసలు దగ్గరినయందాఁకానే
పెనఁగులాటలు మరి బెరియించదగదు

(॥సతు॥)
కడలేని సిగ్గులు కాఁగిలించినందాఁకానే
పొడిమెలమాఁట లియ్యకొన్నదాఁకానే
యెడయక శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్ను నేలె
వెడచేఁత లంతటిపై విచారించఁదగదు

(||pallavi||)
sadulagum̐ badulagu sājamu livi
sadamāya veḍugalu sarasamu lāḍave

(||sadu||)
talabodam̐ lanniyunu tagulainaṁdām̐kane
salamu payyadagŏṁgu jārudām̐kane
naluvaṁka kasarulu navvinayaṁdām̐kane
balimi yaṁtaḍi mīm̐dam̐ basariṁcham̐dagadu

(||sadu||)
mŏnasina guṁpĕnalu mŏkkinayaṁdām̐kane
sĕnagulu kŏnagoram̐ jimmudām̐kāne
tanivoni yāsalu daggarinayaṁdām̐kāne
pĕnam̐gulāḍalu mari bĕriyiṁchadagadu

(||sadu||)
kaḍaleni siggulu kām̐giliṁchinaṁdām̐kāne
pŏḍimĕlamām̐ṭa liyyagŏnnadām̐kāne
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnu nelĕ
vĕḍasem̐ta laṁtaḍibai visāriṁcham̐dagadu