Sadulagum badulagu saajamu leevi

సతులకుఁ బతులకు సాజము లీవి
Language

(॥పల్లవి॥)
సతులకుఁ బతులకు సాజము లీవి
యితవులు సేసుకొంటే నియ్యకోలౌనా(ను?)

(॥॥)
మనసురానియట్టి మాఁట లెన్నియైనా
చనవరులాడితేనే చవులౌను
పెఁనగి పెనఁగి యెంత బిగిసి కొసరినా
వనితల కోపాలు వలపులౌను

(॥॥)
సేయరానియట్టి సేఁతలెన్ని యైనా
పాయని చుట్టాలై తే బాఁతౌను
రాయడింవులైన రచన లెన్నైనా
ఆయమెఱిఁగిన వారి వందములౌను

(॥॥)
వాలితో నెగసక్కెపు నవ్వులెన్ని నవ్వినాను
మేలుగల వారైతే మెచ్చులౌను
యీవల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
చాలుకొన్న నారతులు సతములౌను

(||pallavi||)
sadulagum̐ badulagu sājamu līvi
yidavulu sesugŏṁṭe niyyagolaunā(nu?)

(||||)
manasurāniyaṭṭi mām̐ṭa lĕnniyainā
sanavarulāḍidene savulaunu
pĕm̐nagi pĕnam̐gi yĕṁta bigisi kŏsarinā
vanidala kobālu valabulaunu

(||||)
seyarāniyaṭṭi sem̐talĕnni yainā
pāyani suṭṭālai te bām̐taunu
rāyaḍiṁvulaina rasana lĕnnainā
āyamĕṟim̐gina vāri vaṁdamulaunu

(||||)
vālido nĕgasakkĕbu navvulĕnni navvinānu
melugala vāraide mĕchchulaunu
yīvala śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭe
sālugŏnna nāradulu sadamulaunu