సతులకు నిటువంటి చండితనము గలదా
(॥పల్లవి॥)
సతులకు నిటువంటి చండితనము గలదా
మతకాన నీవు సేసే మహిమలు గాక
(॥॥)
కంచము పొత్తునను ఆ కాంత నీవు నుండఁగాను
కొంచక తానేల వచ్చి కూచుండీ నీకె
లంచముగా మోవితేనె లాలించి యాపెకియ్యఁగ
ఇంచుకించుక నోరూర నీపెకేల యిపుడు
(॥॥)
కనుసన్న నాపె నీకు కతలు సారెఁ జెప్పఁగ
వొనర నడుమనేల వూఁకొనీ నీకె
గునియుచు నీవాయింతికొంగు వట్టి తీయఁగాను
తనువెల్లఁ జెమరించఁ దనకేల యిపుడు
(॥॥)
రవ్వఁగాఁ బానుపుమీఁద రమణి నిన్నుఁ గూడఁగ
ఇవ్వలిపక్కఁ దానేల యెనసీ నీకె
నవ్వుతా శ్రీవేంకటేశ నన్ను నిట్టే యేలితివి
చివ్వన నేఁకరనేల చెలియకు నిపుడు
(||pallavi||)
sadulagu niḍuvaṁṭi saṁḍidanamu galadā
madagāna nīvu sese mahimalu gāga
(||||)
kaṁchamu pŏttunanu ā kāṁta nīvu nuṁḍam̐gānu
kŏṁchaga tānela vachchi kūsuṁḍī nīgĕ
laṁchamugā movidenĕ lāliṁchi yābĕgiyyam̐ga
iṁchugiṁchuga norūra nībĕgela yibuḍu
(||||)
kanusanna nābĕ nīgu kadalu sārĕm̐ jĕppam̐ga
vŏnara naḍumanela vūm̐kŏnī nīgĕ
guniyusu nīvāyiṁtigŏṁgu vaṭṭi tīyam̐gānu
tanuvĕllam̐ jĕmariṁcham̐ danagela yibuḍu
(||||)
ravvam̐gām̐ bānubumīm̐da ramaṇi ninnum̐ gūḍam̐ga
ivvalibakkam̐ dānela yĕnasī nīgĕ
navvudā śhrīveṁkaḍeśha nannu niṭṭe yelidivi
sivvana nem̐karanela sĕliyagu nibuḍu