Sadula gabbidanaale savulu gaavaa

సతుల గబ్బితనాలే చవులు గావా
Language

(॥పల్లవి॥)
సతుల గబ్బితనాలే చవులు గావా
ఇతవులే సుమ్మీ నీకు నెరవులు గావు

(॥సతు॥)
మనసు నీపైఁ బెట్టి మాటల నెంతదూరినా
చనవుగాఁ జేకొనుమీ చలము గాదు
పెనఁగ నాపెచనుమొనలు నిన్ను నాటితె
కినియకుమీ నీపైకేరడము గాదు

(॥సతు॥)
యెదుటనే నిలుచుండి యెంత నిన్నుఁ గొసరినా
అది నీపై మేలు సుమ్మీ అలుక గాదు
పెదవుల మాటాడఁగా పెనుఁదిట్లు వెళ్లితే
పదరకుమీ నీతో పంత మిది గాదు

(॥సతు॥)
కడుసరసమాడుతాఁ గరము నీపైఁ జాఁచితే
విడువని పొందుసుమ్మీ వెగటు గాదు
అడరి శ్రీవేంకటేశ అతివఁ గూడి నవ్వితే
వెడమాట లాడకుమీ వెంగె మిదిగాదు

(||pallavi||)
sadula gabbidanāle savulu gāvā
idavule summī nīgu nĕravulu gāvu

(||sadu||)
manasu nībaim̐ bĕṭṭi māḍala nĕṁtadūrinā
sanavugām̐ jegŏnumī salamu gādu
pĕnam̐ga nābĕsanumŏnalu ninnu nāḍidĕ
kiniyagumī nībaigeraḍamu gādu

(||sadu||)
yĕduḍane nilusuṁḍi yĕṁta ninnum̐ gŏsarinā
adi nībai melu summī aluga gādu
pĕdavula māḍāḍam̐gā pĕnum̐diṭlu vĕḽlide
padaragumī nīdo paṁta midi gādu

(||sadu||)
kaḍusarasamāḍudām̐ garamu nībaim̐ jām̐side
viḍuvani pŏṁdusummī vĕgaḍu gādu
aḍari śhrīveṁkaḍeśha adivam̐ gūḍi navvide
vĕḍamāḍa lāḍagumī vĕṁgĕ midigādu