Sadividhamu nerbu vedasallinadulaaya

సతివిధము నేర్పు వెదచల్లినటులాయ
Language

(॥పల్లవి॥)
సతివిధము నేర్పు వెదచల్లినటులాయ
యితవు లిటమీఁది మే లెట్టు రాఁగలదో

(॥సతి॥)
కనుచూపు పతిమీఁద కాయంబు చెలిమీఁద
మనసు కోర్కులమీఁదమగువ కిపుడు
తనకొ ప్పెచట వీడె తలపువ్వు లెటురాలె
విని వినదు మనమాఁట వెస నెంతవలపో

(॥సతి॥)
నిట్టూర్పు తనువుపై నెరిఁ జెక్కు చేతిపై
గుట్టు చన్నులపయినె కొమ్మ కిపుడు
పట్టినవిడియ మేడ బలుపరా కిది యేడ
తట్టినా నెఱఁగ దిదె తమక మెట్టిదియో

(॥సతి॥)
సిగ్గు దనవయసులో చిఱునవ్వు నెలవిలో
నిగ్గు రతికళలలో నెలఁత కిపుడు
అగ్గలపుశ్రీవేంకటాధిపతిఁ గూడి మరి
యెగ్గు లెంచదు యీపె యెటువంటి గుణమో

(||pallavi||)
sadividhamu nerbu vĕdasallinaḍulāya
yidavu liḍamīm̐di me lĕṭṭu rām̐galado

(||sadi||)
kanusūbu padimīm̐da kāyaṁbu sĕlimīm̐da
manasu korgulamīm̐damaguva kibuḍu
tanagŏ ppĕsaḍa vīḍĕ talabuvvu lĕḍurālĕ
vini vinadu manamām̐ṭa vĕsa nĕṁtavalabo

(||sadi||)
niṭṭūrbu tanuvubai nĕrim̐ jĕkku sedibai
guṭṭu sannulabayinĕ kŏmma kibuḍu
paṭṭinaviḍiya meḍa balubarā kidi yeḍa
taṭṭinā nĕṟam̐ga didĕ tamaga mĕṭṭidiyo

(||sadi||)
siggu danavayasulo siṟunavvu nĕlavilo
niggu radigaḽalalo nĕlam̐ta kibuḍu
aggalabuśhrīveṁkaḍādhibadim̐ gūḍi mari
yĕggu lĕṁchadu yībĕ yĕḍuvaṁṭi guṇamo