Sadivi sadivi vatti jaalimbadu timtegaani

చదివి చదివి వట్టి జాలిఁబడు టింతేకాని
Language

(॥పల్లవి॥)
చదివి చదివి వట్టి జాలిఁబడు టింతేకాని
యెదుట నిన్ను గానఁగ నితరుల వశమా

(॥చదివి॥)
ఆకాశముపొడవు ఆకాశమే యెరుఁగు
ఆకడ జలధిలేఁతు ఆ జలధే యెరుఁగు
శ్రీకాంతుఁడ నీ ఘనము చేరి నీవే యెరుఁగుదు-
నీకడ నింతంతన నితరుల వశమా

(॥చదివి॥)
నదులయిసుకలెల్ల నదులే యెరుఁగును
కదలి గాలియిరవు గాలికే తెలుసు
అదన నాత్మగుణము లంతరాత్మ నీవెరుగు-
దిదియదియనిచెప్ప నితరులవశమా

(॥చదివి॥)
శ్రీవేంకటేశ యిన్నిచింతలకు మొదలు
యీ నీ శరణంటే యిటు నీవే యెరిగింతు
దైవమా నీ కల్పనలు తగ నీవే యెరుఁగుదు-
వీవల నౌఁగాదన నితరుల వశమా

(||pallavi||)
sadivi sadivi vaṭṭi jālim̐baḍu ṭiṁtegāni
yĕduḍa ninnu gānam̐ga nidarula vaśhamā

(||sadivi||)
āgāśhamubŏḍavu āgāśhame yĕrum̐gu
āgaḍa jaladhilem̐tu ā jaladhe yĕrum̐gu
śhrīgāṁtum̐ḍa nī ghanamu seri nīve yĕrum̐gudu-
nīgaḍa niṁtaṁtana nidarula vaśhamā

(||sadivi||)
nadulayisugalĕlla nadule yĕrum̐gunu
kadali gāliyiravu gālige tĕlusu
adana nātmaguṇamu laṁtarātma nīvĕrugu-
didiyadiyanisĕppa nidarulavaśhamā

(||sadivi||)
śhrīveṁkaḍeśha yinnisiṁtalagu mŏdalu
yī nī śharaṇaṁṭe yiḍu nīve yĕrigiṁtu
daivamā nī kalbanalu taga nīve yĕrum̐gudu-
vīvala naum̐gādana nidarula vaśhamā