చదివెఁ బో ప్రాణి సకలము యీ
(॥పల్లవి॥)
చదివెఁ బో ప్రాణి సకలము యీ-
చదువుమీఁది విద్య చదువఁడాయఁ గాని
(॥చది॥)
సిరులు చంచలమని చేఁతలధ్రువమని
పరగుసంసారము బయలని
తొరలిన సుఖమెల్ల దు:ఖమూలమని
యెరిఁగి లోభమువీడ నెరఁగఁడాయఁగాని
(॥చది॥)
తలకొన్న ధర్మమే తలమీఁది మోఁపని
వలసీనొల్లమి దైవవశమని
కలిమియు లేమియుఁ గడవఁగ రాదని
తెలిసి లోభము వీడఁ దెలియఁడాయఁగాని
(॥చది॥)
యేచిన పరహితమెంతయుఁ దమ దని
వాచవులిన్ని నెవ్వగలని
యీచందమున వేంకటేశుచేఁతలని
చూచి లోభమువీడఁ జూడడాయఁగాని
(||pallavi||)
sadivĕm̐ bo prāṇi sagalamu yī-
saduvumīm̐di vidya saduvam̐ḍāyam̐ gāni
(||sadi||)
sirulu saṁchalamani sem̐taladhruvamani
paragusaṁsāramu bayalani
tŏralina sukhamĕlla du:khamūlamani
yĕrim̐gi lobhamuvīḍa nĕram̐gam̐ḍāyam̐gāni
(||sadi||)
talagŏnna dharmame talamīm̐di mom̐pani
valasīnŏllami daivavaśhamani
kalimiyu lemiyum̐ gaḍavam̐ga rādani
tĕlisi lobhamu vīḍam̐ dĕliyam̐ḍāyam̐gāni
(||sadi||)
yesina parahidamĕṁtayum̐ dama dani
vāsavulinni nĕvvagalani
yīsaṁdamuna veṁkaḍeśhusem̐talani
sūsi lobhamuvīḍam̐ jūḍaḍāyam̐gāni