Sadigim bamtamu soobam janadu ramanuni toda

సతికిఁ బంతము చూపఁ జనదు రమణుని తోడ
Language

(॥పల్లవి॥)
సతికిఁ బంతము చూపఁ జనదు రమణుని తోడ
మితిమీర వినయమున మెలఁగంగవలెను

(॥సతి॥)
వలచి పైకొనిన నవ్వలి పరాకై యున్న
చెలఁగి పతి కిచ్చికము సేయవలెను
పలికినను వెస మరచి పలుక కుండిన నతని
కొలువుసేయుచు రతులఁ గొసరంగవలెను

(॥సతి॥)
కనుఁ గొనిన రాజసంబునఁ గనుఁగొనకయున్న
ననుపు చల్లుచు నతనిఁ జెనకంగ వలెను
పెనఁగినను గుట్టుతో బెనఁగ కూరకయున్న
చనవుసేసుక మోవి చవి చూపవలెను

(॥సతి॥)
సొరిది నవ్విన మనసు చూడ నటు నవ్వకున్న
నిరతమగుపొందు లటు నెరపంగ వలెను
అరిది శ్రీ వేంకటేశుఁ డాతఁడే నినుఁ గూడె
సరికి బేసికి నిటుల జట్టిగొన వలెను

(||pallavi||)
sadigim̐ baṁtamu sūbam̐ janadu ramaṇuni toḍa
midimīra vinayamuna mĕlam̐gaṁgavalĕnu

(||sadi||)
valasi paigŏnina navvali parāgai yunna
sĕlam̐gi padi kichchigamu seyavalĕnu
paliginanu vĕsa marasi paluga kuṁḍina nadani
kŏluvuseyusu radulam̐ gŏsaraṁgavalĕnu

(||sadi||)
kanum̐ gŏnina rājasaṁbunam̐ ganum̐gŏnagayunna
nanubu sallusu nadanim̐ jĕnagaṁga valĕnu
pĕnam̐ginanu guṭṭudo bĕnam̐ga kūragayunna
sanavusesuga movi savi sūbavalĕnu

(||sadi||)
sŏridi navvina manasu sūḍa naḍu navvagunna
niradamagubŏṁdu laḍu nĕrabaṁga valĕnu
aridi śhrī veṁkaḍeśhum̐ ḍādam̐ḍe ninum̐ gūḍĕ
sarigi besigi niḍula jaṭṭigŏna valĕnu