Sadi veṟabu delibi sanavimka niyyaraadaa

సతి వెఱపు దెలిపి చనవింక నియ్యరాదా
Language

(॥పల్లవి॥)
సతి వెఱపు దెలిపి చనవింక నియ్యరాదా
చతురుఁడ నీకాకెతో చలము లింకానా

(॥సతి॥)
వనిత నీచెక్కులపై వలపు వాయఁగలేక
కొనగోర నేల వాసీఁగోరి కెట్టిదో
ననిచి మరుశాస్త్రము నాలుకఁ జదువలేక
వెనక నీపేరు చదివీఁ బెదవులనె

(॥సతి॥)
తరుణి నీకుమదనమంత్రము నేరుపలేక
సిరుల చేసన్నలను చేసుకొనీని
అరుదురగా నీమోహము లెక్క వెట్టలేక
పొరలి చింతలఁ దలపోసీని

(॥సతి॥)
చెలియ నీమోము చూచి సిగ్గులు చల్లఁగలేక
మొలకమోవిని లోలో ముంచి నవ్వీని
కులికి శ్రీ వేంకటాశ కూడి నిన్నుఁ బాయలేక
నిలువురతులతోడ నిన్ను లాలించీని

(||pallavi||)
sadi vĕṟabu dĕlibi sanaviṁka niyyarādā
sadurum̐ḍa nīgāgĕdo salamu liṁkānā

(||sadi||)
vanida nīsĕkkulabai valabu vāyam̐galega
kŏnagora nela vāsīm̐gori kĕṭṭido
nanisi maruśhāstramu nālugam̐ jaduvalega
vĕnaga nīberu sadivīm̐ bĕdavulanĕ

(||sadi||)
taruṇi nīgumadanamaṁtramu nerubalega
sirula sesannalanu sesugŏnīni
aruduragā nīmohamu lĕkka vĕṭṭalega
pŏrali siṁtalam̐ dalabosīni

(||sadi||)
sĕliya nīmomu sūsi siggulu sallam̐galega
mŏlagamovini lolo muṁchi navvīni
kuligi śhrī veṁkaḍāśha kūḍi ninnum̐ bāyalega
niluvuraduladoḍa ninnu lāliṁchīni