Sadi semtalagu nannu samtosimchu kommaneeni

సతి చేఁతలకు నన్ను సంతోసించు కొమ్మనీని
Language

(॥పల్లవి॥)
సతి చేఁతలకు నన్ను సంతోసించు కొమ్మనీని
ఇతవౌనా నా కవి యెటువంటి వాఁడే

(॥॥)
సొలసి తనతో నాపె సుద్దు లెల్లాఁ జెప్పఁగాను
యెలమి నే వద్ద నుండి యెట్టు విందునే
వలపులు చల్లి యాలవట్టము తన కిడఁగా
వొలిసి యందుకు నెట్టు వోర్చుకొని వుందునే

(॥॥)
కొచ్చి కొచ్చియాపె దన్ను కుచముల నొత్తఁగాను
యిచ్చగించి నే నప్పు డెట్టు చూతునే
పచ్చిదేరఁ బానుపుపై పాదా లాపె పిసుకఁగా
కచ్చుపెట్టి యెట్టు పొత్తు గలసి లో నౌదునే

(॥॥)
కూరిమిఁ దనకు నాపె కొలువులు సేయఁగాను
ధీరత నే నెట్టు సమ్మతించు కొందునే
యీ రీతి శ్రీ వేంకటేశుఁడింతలోనే నన్నుఁగూడె
తేరెఁ బనులిఁక నెట్టు తెలియఁ జెప్పుదునే

(||pallavi||)
sadi sem̐talagu nannu saṁtosiṁchu kŏmmanīni
idavaunā nā kavi yĕḍuvaṁṭi vām̐ḍe

(||||)
sŏlasi tanado nābĕ suddu lĕllām̐ jĕppam̐gānu
yĕlami ne vadda nuṁḍi yĕṭṭu viṁdune
valabulu salli yālavaṭṭamu tana kiḍam̐gā
vŏlisi yaṁdugu nĕṭṭu vorsugŏni vuṁdune

(||||)
kŏchchi kŏchchiyābĕ dannu kusamula nŏttam̐gānu
yichchagiṁchi ne nappu ḍĕṭṭu sūdune
pachchideram̐ bānububai pādā lābĕ pisugam̐gā
kachchubĕṭṭi yĕṭṭu pŏttu galasi lo naudune

(||||)
kūrimim̐ danagu nābĕ kŏluvulu seyam̐gānu
dhīrada ne nĕṭṭu sammadiṁchu kŏṁdune
yī rīdi śhrī veṁkaḍeśhum̐ḍiṁtalone nannum̐gūḍĕ
terĕm̐ banulim̐ka nĕṭṭu tĕliyam̐ jĕppudune