సతి చక్కఁదన మెంతో సరసుని మోహమోంతో
(॥పల్లవి॥)
సతి చక్కఁదన మెంతో సరసుని మోహమోంతో
చతురిక లిందరును సరిఁజూడరమ్మా
(॥సతి॥)
కాంతకన్నులు వ్రాసి కడలు వ్రాయఁగ రాక
చింతోడఁ దలవంచెఁ జెలివిభుఁడు
పంతపునడుము వ్రాసి బయలువ్రాయఁగ రాక
కొంతదడ వుస్సురనెఁ గోమలిప్రాణేశుఁడు
(॥సతి॥)
కలికికుచాలు వ్రాసి కఠినము వ్రాయలేక
తలపోయఁదొడఁగెఁ బంతపునిభుఁడు
నలినాక్షిమోము వ్రాసి నవ్వులు వ్రాయఁగ రాక
నిలువున వెరగందె నెలఁత రమణుఁడు
(॥సతి॥)
వనితకాఁగిటఁ దన్ను వ్రాసి రతి వ్రాయలేక
తనువెల్ల మఱచెను తమకమున
వెనకముందర వ్రాసి వేడుక వ్రాయఁగ రాక
చినుకుఁజెమట వ్రాసె శ్రీవేంకటేశుఁడు
(||pallavi||)
sadi sakkam̐dana mĕṁto sarasuni mohamoṁto
saduriga liṁdarunu sarim̐jūḍarammā
(||sadi||)
kāṁtagannulu vrāsi kaḍalu vrāyam̐ga rāga
siṁtoḍam̐ dalavaṁchĕm̐ jĕlivibhum̐ḍu
paṁtabunaḍumu vrāsi bayaluvrāyam̐ga rāga
kŏṁtadaḍa vussuranĕm̐ gomaliprāṇeśhum̐ḍu
(||sadi||)
kaligigusālu vrāsi kaṭhinamu vrāyalega
talaboyam̐dŏḍam̐gĕm̐ baṁtabunibhum̐ḍu
nalinākṣhimomu vrāsi navvulu vrāyam̐ga rāga
niluvuna vĕragaṁdĕ nĕlam̐ta ramaṇum̐ḍu
(||sadi||)
vanidagām̐giḍam̐ dannu vrāsi radi vrāyalega
tanuvĕlla maṟasĕnu tamagamuna
vĕnagamuṁdara vrāsi veḍuga vrāyam̐ga rāga
sinugum̐jĕmaḍa vrāsĕ śhrīveṁkaḍeśhum̐ḍu