Sadi ninnu gelisenu javvanabu garideelo

సతి నిన్ను గెలిచెను జవ్వనపు గరిడీలో
Language

(॥పల్లవి॥)
సతి నిన్ను గెలిచెను జవ్వనపు గరిడీలో
మతిలోన మెచ్చి మెచ్చి మన్నించు రమణుఁడా

(॥సతి॥)
కనుసూటి వలపు కాంత చూచినచూపు
కొనకెక్క మరుఁడదె గురులేసెను
మొనకత్తిసామూ ములువాఁడికొనగోరు
పెనఁగి చెక్కులనొత్తి పేరెమువారెను

(॥సతి॥)
చేసూటివలపూ చెలికాఁగిలించినది
బాసతోనే కాయజుఁడు పందె మాడెను
మూసిదింపు మొరఁగూ ముంచినపయ్యదకొంగు
ఆసలు నీకుఁ జూపి ఆయాలు రేఁచెను

(॥సతి॥)
మొగసూటివలపూ మోహపు రమణి నవ్వు
తగవుతో మదనుఁడు దారగట్టెను
అగపడి శ్రీ వేంకటాధిప నీవు గూడితి
జగడమింతయుఁ దీరి చనవు చేకొనెను

(||pallavi||)
sadi ninnu gĕlisĕnu javvanabu gariḍīlo
madilona mĕchchi mĕchchi manniṁchu ramaṇum̐ḍā

(||sadi||)
kanusūḍi valabu kāṁta sūsinasūbu
kŏnagĕkka marum̐ḍadĕ gurulesĕnu
mŏnagattisāmū muluvām̐ḍigŏnagoru
pĕnam̐gi sĕkkulanŏtti perĕmuvārĕnu

(||sadi||)
sesūḍivalabū sĕligām̐giliṁchinadi
bāsadone kāyajum̐ḍu paṁdĕ māḍĕnu
mūsidiṁpu mŏram̐gū muṁchinabayyadagŏṁgu
āsalu nīgum̐ jūbi āyālu rem̐sĕnu

(||sadi||)
mŏgasūḍivalabū mohabu ramaṇi navvu
tagavudo madanum̐ḍu dāragaṭṭĕnu
agabaḍi śhrī veṁkaḍādhiba nīvu gūḍidi
jagaḍamiṁtayum̐ dīri sanavu segŏnĕnu