Sadi ninnimta sesina jaananim jeppedigaaga

సతి నిన్నింత చేసిన జాణనిఁ జెప్పేదిగాక
Language

(॥పల్లవి॥)
సతి నిన్నింత చేసిన జాణనిఁ జెప్పేదిగాక
కతకారి వైతివి కడుఁజిన్నదానవు

(॥సతి॥)
చెలులమఱఁగులును చిత్తములో కరఁగులు
తెలిసిగ్గులును యేడఁ దెచ్చుకొంటివే
మలగుపై వొరగులు మరి నివ్వెరగులును
కలికి నీవెటువలెఁ గలిగించుకొంటివే

(॥సతి॥)
చిఱుతనవ్వులును చిందేటికొప్పుపువ్వులును
కెఱలి నేఁ డెందు దొరకించుకొంటివే
కఱతలమాటలును కన్నులలో తేటలును
గుఱుతు లిన్నేసి యెందుఁ గూడపెట్టుకొంటివే

(॥సతి॥)
కావరపుఁగెలపులు కమ్ముకొన్నవలపులు
యీవేళ నీవెట్టు గడియించుకొంటివే
శ్రీవేంకటేశుఁడట చేరి నిన్నుఁ గూడెనట
వేవేలు నీచేఁత లెంత వెలయించుకొంటివే

(||pallavi||)
sadi ninniṁta sesina jāṇanim̐ jĕppedigāga
kadagāri vaidivi kaḍum̐jinnadānavu

(||sadi||)
sĕlulamaṟam̐gulunu sittamulo karam̐gulu
tĕlisiggulunu yeḍam̐ dĕchchugŏṁṭive
malagubai vŏragulu mari nivvĕragulunu
kaligi nīvĕḍuvalĕm̐ galigiṁchugŏṁṭive

(||sadi||)
siṟudanavvulunu siṁdeḍigŏppubuvvulunu
kĕṟali nem̐ ḍĕṁdu dŏragiṁchugŏṁṭive
kaṟadalamāḍalunu kannulalo teḍalunu
guṟudu linnesi yĕṁdum̐ gūḍabĕṭṭugŏṁṭive

(||sadi||)
kāvarabum̐gĕlabulu kammugŏnnavalabulu
yīveḽa nīvĕṭṭu gaḍiyiṁchugŏṁṭive
śhrīveṁkaḍeśhum̐ḍaḍa seri ninnum̐ gūḍĕnaḍa
vevelu nīsem̐ta lĕṁta vĕlayiṁchugŏṁṭive