సతి నీఁ జేసెనంటా సాకిరులేల పెట్టేవు
(॥పల్లవి॥)
సతి నీఁ జేసెనంటా సాకిరులేల పెట్టేవు
కతకారితనమింతే గరువము కాదయ్యా
(॥సతి॥)
పంతములు బిగువులు పలుకులు కొసరులు
కాంతల కెప్పుడు నివి గలిగినవే
చెంతఁ జెక్కిటిచేతులు చిరుసిగ్గులు నవ్వులు
ఇంతులకు సాజమిది యెగ్గుపట్ట రాదయ్యా
(॥సతి॥)
యెలఇంపుఁ జేఁతలును యెల్లిదాలు పల్లదాలు
అలివేణులకు నివి యలవాటులే
కలికితనములు బింకములు బీరములును
చెలువచందాలు రట్టుసేయఁగరాదయ్యా
(॥సతి॥)
సరసాలు జంకెనలు సరివాలుఁ జూపులును
సరసిజాక్షుల కివి సంగతులే
ఇరవై శ్రీ వేంకటేశ యీకె నిట్టె కూడితివి
తరుణుల వోజ లివి తగదనరాదయ్యా
(||pallavi||)
sadi nīm̐ jesĕnaṁṭā sāgirulela pĕṭṭevu
kadagāridanamiṁte garuvamu kādayyā
(||sadi||)
paṁtamulu biguvulu palugulu kŏsarulu
kāṁtala kĕppuḍu nivi galiginave
sĕṁtam̐ jĕkkiḍisedulu sirusiggulu navvulu
iṁtulagu sājamidi yĕggubaṭṭa rādayyā
(||sadi||)
yĕla̮iṁpum̐ jem̐talunu yĕllidālu palladālu
aliveṇulagu nivi yalavāḍule
kaligidanamulu biṁkamulu bīramulunu
sĕluvasaṁdālu raṭṭuseyam̐garādayyā
(||sadi||)
sarasālu jaṁkĕnalu sarivālum̐ jūbulunu
sarasijākṣhula kivi saṁgadule
iravai śhrī veṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
taruṇula voja livi tagadanarādayyā