Sadi neegu meludi jaanavu neevu

సతి నీకు మేలుది జాణవు నీవు
Language

(॥పల్లవి॥)
సతి నీకు మేలుది జాణవు నీవు
మతిలోన మరవక మన్నించవయ్యా*

(॥సతి॥)
పలుకులనే యింతి పచ్చనిపందిలి వెట్టె
అలరి కూచుండి పెండ్లాడవయ్యా
సెలవి నవ్వులనే సేసపాలివె చల్లె
సొలవక యీకె మోము చూడవయ్యా

(॥సతి॥)
తిన్నని సిగ్గులవే తెరమరఁగులు వెట్టె
కన్నెకుఁ గంకణ మిట్టె కట్టవయ్యా
సన్నలా చాయలనె సరుస నీ కాలు దొక్కె
చన్నులఁ బూజ గుండలు సారెఁ బూజించవయ్యా

(॥సతి॥)
కూరిమిసరసముల కొంగులముళ్లు వేసి
గారవించి మోవి పొత్తు గలయవయ్యా
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి వనితను
చేరి నిచ్చా సోబనాలఁ జెలఁగవయ్యా

(||pallavi||)
sadi nīgu meludi jāṇavu nīvu
madilona maravaga manniṁchavayyā*

(||sadi||)
palugulane yiṁti pachchanibaṁdili vĕṭṭĕ
alari kūsuṁḍi pĕṁḍlāḍavayyā
sĕlavi navvulane sesabālivĕ sallĕ
sŏlavaga yīgĕ momu sūḍavayyā

(||sadi||)
tinnani siggulave tĕramaram̐gulu vĕṭṭĕ
kannĕgum̐ gaṁkaṇa miṭṭĕ kaṭṭavayyā
sannalā sāyalanĕ sarusa nī kālu dŏkkĕ
sannulam̐ būja guṁḍalu sārĕm̐ būjiṁchavayyā

(||sadi||)
kūrimisarasamula kŏṁgulamuḽlu vesi
gāraviṁchi movi pŏttu galayavayyā
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi vanidanu
seri nichchā sobanālam̐ jĕlam̐gavayyā