సదరమా ధైర్యంబు సతులకునుఁ బతులకును
(॥పల్లవి॥)
సదరమా ధైర్యంబు సతులకునుఁ బతులకును
చెదర కిటువలెఁ బొందు సేయవలెఁ గాక
(॥సద॥)
గుదిగొన్న తమకములు కూటములకునుఁ దగులు
పొదలు నేస్తములు వలపులకుఁ దగులు
సదమదపుఁ గోరికలు సరసంబులకుఁ దగులు
యెదురుచూపులు తెగనియింపులకుఁ దగులు
(॥సద॥)
మునుకొన్న తలపోఁత మోవిచవులకుఁ దగులు
ననుపు లేపొద్దు మరి నవ్వులకుఁ దగులు
పెనగొన్న యడియాస ప్రియములకుఁ బెనుఁదగులు
చెనకుఁ జేఁతలు మదన చిహ్నలకుఁ దగులు
(॥సద॥)
పోదిమాఁటలు మిగుల భోగంబులకుఁ దగులు
ఆదరింపులు సతములగుటకునుఁ దగులు
యీదెసల శ్రీ వేంకటేశుఁ డింతులఁ గూడె
పాదుకొను మొక్కులే పనులకునుఁ దగులు
(||pallavi||)
sadaramā dhairyaṁbu sadulagunum̐ badulagunu
sĕdara kiḍuvalĕm̐ bŏṁdu seyavalĕm̐ gāga
(||sada||)
gudigŏnna tamagamulu kūḍamulagunum̐ dagulu
pŏdalu nestamulu valabulagum̐ dagulu
sadamadabum̐ gorigalu sarasaṁbulagum̐ dagulu
yĕdurusūbulu tĕganiyiṁpulagum̐ dagulu
(||sada||)
munugŏnna talabom̐ta movisavulagum̐ dagulu
nanubu lebŏddu mari navvulagum̐ dagulu
pĕnagŏnna yaḍiyāsa priyamulagum̐ bĕnum̐dagulu
sĕnagum̐ jem̐talu madana sihnalagum̐ dagulu
(||sada||)
podimām̐ṭalu migula bhogaṁbulagum̐ dagulu
ādariṁpulu sadamulaguḍagunum̐ dagulu
yīdĕsala śhrī veṁkaḍeśhum̐ ḍiṁtulam̐ gūḍĕ
pādugŏnu mŏkkule panulagunum̐ dagulu