సతమైనదానఁగాక సటలా నేను । నీ
(॥పల్లవి॥)
సతమైనదానఁగాక సటలా నేను । నీ-
మతిలో మెలఁగకుంటే మగువనా నేను
(॥సీత॥)
మందలించి యిందరిలో మాయసేసి మేకులకు
సందడిఁ గాలుదొక్కేటిసతినా నేను
అందుకోలుమోవి యిచ్చి ఆసరేఁచి సారె సారె
చందమామగుటుకలసతినా నేను
(॥సీత॥)
కన్నులఁ దప్పకచూచి కడగడలనే వుండి
సన్నలనే పొద్దువుచ్చేసతినా నేను
వన్నెల నీమీఁద నిట్టె వలపులు చల్లి చల్లి
చన్నుల మొనులుచూపేసతినా నేను
(॥సీత॥)
శిరసు వంచి నవ్వి సిగ్గులువిడిచి నీ-
సరుసలనిటచుండేసతినా నేను
నిరతి శ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడఁగాను
వురమెక్కినదాన వేరొకతోనా నేను
(||pallavi||)
sadamainadānam̐gāga saḍalā nenu | nī-
madilo mĕlam̐gaguṁṭe maguvanā nenu
(||sīda||)
maṁdaliṁchi yiṁdarilo māyasesi megulagu
saṁdaḍim̐ gāludŏkkeḍisadinā nenu
aṁdugolumovi yichchi āsarem̐si sārĕ sārĕ
saṁdamāmaguḍugalasadinā nenu
(||sīda||)
kannulam̐ dappagasūsi kaḍagaḍalane vuṁḍi
sannalane pŏdduvuchchesadinā nenu
vannĕla nīmīm̐da niṭṭĕ valabulu salli salli
sannula mŏnulusūbesadinā nenu
(||sīda||)
śhirasu vaṁchi navvi sigguluviḍisi nī-
sarusalaniḍasuṁḍesadinā nenu
niradi śhrīveṁkaḍeśha nīvu nannum̐ gūḍam̐gānu
vuramĕkkinadāna verŏgadonā nenu