Sadagaamdu mikkilini sarasum deedam dinnidaa

సటకాఁడు మిక్కిలిని సరసుఁ డీతఁ డిన్నిటా
Language

(॥పల్లవి॥)
సటకాఁడు మిక్కిలిని సరసుఁ డీతఁ డిన్నిటా
తటుకన వలపించి దక్కించుకొనవే

(॥సట॥)
సిగ్గులు వడకువే చెఱగువట్టీ నతఁడు
అగ్గలపువట్టి జాగు అదియూఁ గొంత
వొగ్గి యాతని మెల్లనే వొత్తుక వచ్చితి మిందు
వెగ్గళించి నీ యిల్లిఁక వెళ్లఁగ నియ్యకువే

(॥సట॥)
నవ్వులు నవ్వకువే ననుపు సేసీ నతఁడు
అవ్వల నీ తరితీపు అదియూఁ గొంత
యెవ్వరు నెఱఁగకుండా నెలయించి తెచ్చితిమి
పవ్వళించే యింటిలోన బాస సేయించుకోవే

(॥సట॥)
తలవంచుకోకువే దగ్గరనున్నాఁ డతఁడు
అలసివుండిన భావ మదియూఁ గొంత
యెలమి శ్రీ వేంకటేశు నిటు గూర్చితి నే నిన్ను
మలసి నీ కాఁగిటనే మరిగించుకొనవే

(||pallavi||)
saḍagām̐ḍu mikkilini sarasum̐ ḍīdam̐ ḍinniḍā
taḍugana valabiṁchi dakkiṁchugŏnave

(||saḍa||)
siggulu vaḍaguve sĕṟaguvaṭṭī nadam̐ḍu
aggalabuvaṭṭi jāgu adiyūm̐ gŏṁta
vŏggi yādani mĕllane vŏttuga vachchidi miṁdu
vĕggaḽiṁchi nī yillim̐ka vĕḽlam̐ga niyyaguve

(||saḍa||)
navvulu navvaguve nanubu sesī nadam̐ḍu
avvala nī taridību adiyūm̐ gŏṁta
yĕvvaru nĕṟam̐gaguṁḍā nĕlayiṁchi tĕchchidimi
pavvaḽiṁche yiṁṭilona bāsa seyiṁchugove

(||saḍa||)
talavaṁchugoguve daggaranunnām̐ ḍadam̐ḍu
alasivuṁḍina bhāva madiyūm̐ gŏṁta
yĕlami śhrī veṁkaḍeśhu niḍu gūrsidi ne ninnu
malasi nī kām̐giḍane marigiṁchugŏnave