Sadagaam demidigi vesaalu seseene

సటకాఁ డేమిటికి వేసాలు సేసీనే
Language

(॥పల్లవి॥)
సటకాఁ డేమిటికి వేసాలు సేసీనే
ఇటు నాపై బత్తిగల దెరుఁగుదు ననవే

(॥సట॥)
పెనఁగి నేఁ బిలువఁగా బిగిసి రాకుండేవాఁడు
తన తమి యెక్కడఁ బాఁతరఁ బెట్టీనే
చెనకఁగా నాతోను సిగ్గులు వడేటివాఁడు
మనసు మర్మము లెట్టు మట్టు పరచీనే

(॥సట॥)
సరసము నే నాడఁగా చాయసీసుకొనేవాఁడు
కురిసేటి చెమట లేగొంది దాఁచీనే
విరుల నే వేయఁగాను వెసనొడ్డుకొనేవాఁడు
యిరవైనపులకలు యెట్టు మానిపీనే

(॥సట॥)
గోరికొనఁ జిమ్మఁగాను గుట్టున నుండేవాఁడు
వూరేటి మోవితేనె లేవుట్టిఁ బెట్టీనే
యీరీతి శ్రీవేంకటేశుఁ దింతలో వచ్చి నన్నేలె
తారుకాణసంతోసా లెందాఁకాఁ జెప్పీనే

(||pallavi||)
saḍagām̐ ḍemiḍigi vesālu sesīne
iḍu nābai battigala dĕrum̐gudu nanave

(||saḍa||)
pĕnam̐gi nem̐ biluvam̐gā bigisi rāguṁḍevām̐ḍu
tana tami yĕkkaḍam̐ bām̐taram̐ bĕṭṭīne
sĕnagam̐gā nādonu siggulu vaḍeḍivām̐ḍu
manasu marmamu lĕṭṭu maṭṭu parasīne

(||saḍa||)
sarasamu ne nāḍam̐gā sāyasīsugŏnevām̐ḍu
kuriseḍi sĕmaḍa legŏṁdi dām̐sīne
virula ne veyam̐gānu vĕsanŏḍḍugŏnevām̐ḍu
yiravainabulagalu yĕṭṭu mānibīne

(||saḍa||)
gorigŏnam̐ jimmam̐gānu guṭṭuna nuṁḍevām̐ḍu
vūreḍi movidenĕ levuṭṭim̐ bĕṭṭīne
yīrīdi śhrīveṁkaḍeśhum̐ diṁtalo vachchi nannelĕ
tārugāṇasaṁtosā lĕṁdām̐kām̐ jĕppīne