Saayavaadusesugoni sarusam goosumdumgaaga

చాయవాటుసేసుకొని సరుసఁ గూచుండుఁగాక
Language

(॥పల్లవి॥)
చాయవాటుసేసుకొని సరుసఁ గూచుండుఁగాక
నాయములేల పెట్టీనే నాటకపు విభుఁడు

(॥చాయ॥)
కన్నుల జంకించితినా గద్దించితినా బొమ్మల
చిన్నఁబోయి తానేల సిగ్గువడీనే
అన్నువ మోవిమీఁదఁ జిట్టంటుచేతఁ లుంటేనేమి
చిన్న వాటిపనులు తీసివేయఁగవచ్చునా

(॥చాయ॥)
చొప్పులు వెదకితినా సోఁకఁగ నాడితినా
తప్పక చూచి తానేల తలవంచీనే
కప్పిన పచ్చడమెల్లా కడుఁబసపై తేనేమి
యెప్పుడు గలదే తన కేమి సేయవచ్చును

(॥చాయ॥)
చలము సాదించితినా జంపులు నడపితినా
నలువంకఁ జూచి యేల నవ్వులు నవ్వీనే
యెలమి శ్రీవేంకటేశుఁడిట్టె తాను నన్ను నేలె
వలపు వెంట వచ్చితే వారించ నేఁటికే

(||pallavi||)
sāyavāḍusesugŏni sarusam̐ gūsuṁḍum̐gāga
nāyamulela pĕṭṭīne nāḍagabu vibhum̐ḍu

(||sāya||)
kannula jaṁkiṁchidinā gaddiṁchidinā bŏmmala
sinnam̐boyi tānela sigguvaḍīne
annuva movimīm̐dam̐ jiṭṭaṁṭusedam̐ luṁṭenemi
sinna vāḍibanulu tīsiveyam̐gavachchunā

(||sāya||)
sŏppulu vĕdagidinā som̐kam̐ga nāḍidinā
tappaga sūsi tānela talavaṁchīne
kappina pachchaḍamĕllā kaḍum̐basabai tenemi
yĕppuḍu galade tana kemi seyavachchunu

(||sāya||)
salamu sādiṁchidinā jaṁpulu naḍabidinā
naluvaṁkam̐ jūsi yela navvulu navvīne
yĕlami śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ tānu nannu nelĕ
valabu vĕṁṭa vachchide vāriṁcha nem̐ṭige