చాయల సన్నలఁ దన్ను సాదించనేలే
(॥పల్లవి॥)
చాయల సన్నలఁ దన్ను సాదించనేలే
పోయినదే పొల్లుగాక పురివిచ్చ నేఁటికే
(॥॥)
కాయమిది తనసొమ్ము కాఁకలే నాసొమ్ము
ఆయాలు మోవఁదన్ను నాడనేఁటికే
సేయరానిచేఁత చేసె చెక్కుచేయి నాకు వచ్చె
దాయగాఁడు తనతోడిదంటతన మేఁటికే
(॥॥)
మనసెల్లాఁ దనసొమ్ము మచ్చికలే నాసొమ్ము
చెనకి తన్నంత రట్టుసేయ నేఁటికే
తనకే నిదుర యెచ్చె తగె నాకు జాగరాలు
ఘనుఁడు తన్నింక నే గద్దించఁగలనా
(॥॥)
కాఁగిలిదె తనసొమ్ము కళదాఁకేది నాసొమ్ము
తోఁగి చూచి తనతోడి దొమ్ము లేఁటికే
వీఁగక శ్రీవేంకటాద్రివిభుఁడిట్టె నన్నుఁగూడె
పాఁగితి నే నన్నిటాను పంతమాడ నేఁటికే
(||pallavi||)
sāyala sannalam̐ dannu sādiṁchanele
poyinade pŏllugāga purivichcha nem̐ṭige
(||||)
kāyamidi tanasŏmmu kām̐kale nāsŏmmu
āyālu movam̐dannu nāḍanem̐ṭige
seyarānisem̐ta sesĕ sĕkkuseyi nāgu vachchĕ
dāyagām̐ḍu tanadoḍidaṁṭadana mem̐ṭige
(||||)
manasĕllām̐ danasŏmmu machchigale nāsŏmmu
sĕnagi tannaṁta raṭṭuseya nem̐ṭige
tanage nidura yĕchchĕ tagĕ nāgu jāgarālu
ghanum̐ḍu tanniṁka ne gaddiṁcham̐galanā
(||||)
kām̐gilidĕ tanasŏmmu kaḽadām̐kedi nāsŏmmu
tom̐gi sūsi tanadoḍi dŏmmu lem̐ṭige
vīm̐gaga śhrīveṁkaḍādrivibhum̐ḍiṭṭĕ nannum̐gūḍĕ
pām̐gidi ne nanniḍānu paṁtamāḍa nem̐ṭige