చాయ సేసుకొనుఁ గాక సతుల యడాటాన
(॥పల్లవి॥)
చాయ సేసుకొనుఁ గాక సతుల యడాటాన
పాయపు రమణుఁడైతే పంతము గొనీనా
(॥చాయ॥)
చెక్కు నొక్కి సేద దేర్చి సేవలు సేసితిని
యెక్కువ తక్కువ లెల్లా నిఁక నేడవే
గక్కన మీరు చెప్పఁగా గాని మ్మంటి మీమాట
అక్కడనె నిలుచున్నాఁ డప్పటిఁదా నేఁటిదే
(॥చాయ॥)
కొంకు వాయఁ గాఁగిలించి కూరిమి నవ్వు నవ్వి
యింకఁ జెమరించితిని యిఁక నేఁటిదే
మంకుదాన ననే రంటా మారుమాటలాడ మీకు
బింకము లింగా మానఁడు పెనఁగనే వలెనా
(॥చాయ॥)
మోవి యిచ్చి మొక్కు మొక్కు మోహ మెల్లా జల్లితి
యీవల వట్టిగుట్లు యిఁక నేఁటికే
మే వెంచి శ్రీవెంకటేశు మీ మొకమోటఁ గూడితి
నావాఁడనె అనీఁ దాను నమ్మికలు వలెనా
(||pallavi||)
sāya sesugŏnum̐ gāga sadula yaḍāḍāna
pāyabu ramaṇum̐ḍaide paṁtamu gŏnīnā
(||sāya||)
sĕkku nŏkki seda dersi sevalu sesidini
yĕkkuva takkuva lĕllā nim̐ka neḍave
gakkana mīru sĕppam̐gā gāni mmaṁṭi mīmāḍa
akkaḍanĕ nilusunnām̐ ḍappaḍim̐dā nem̐ṭide
(||sāya||)
kŏṁku vāyam̐ gām̐giliṁchi kūrimi navvu navvi
yiṁkam̐ jĕmariṁchidini yim̐ka nem̐ṭide
maṁkudāna nane raṁṭā mārumāḍalāḍa mīgu
biṁkamu liṁgā mānam̐ḍu pĕnam̐gane valĕnā
(||sāya||)
movi yichchi mŏkku mŏkku moha mĕllā jallidi
yīvala vaṭṭiguṭlu yim̐ka nem̐ṭige
me vĕṁchi śhrīvĕṁkaḍeśhu mī mŏgamoḍam̐ gūḍidi
nāvām̐ḍanĕ anīm̐ dānu nammigalu valĕnā