Saaresaaregunu nela jampumaamtalu

సారెసారెకును నేల జంపుమాఁటలు
Language

(॥పల్లవి॥)
సారెసారెకును నేల జంపుమాఁటలు
ఆరెఁ దేరెఁ బదరోరి ఆరడై తిఁకు(తిఁక?)ను

(॥సారె॥)
ఆడరాదు దొరవని ఆడకున్నఁ బోదు నిన్ను
చూడఁ జూడ నీమోవేల చుక్కలాయరా
తోడ నేఁగోరితి వెంట తొడుకులైనట్లాయ నీ
జాడలెల్లఁ గంటి వింటి చాలుఁజాలుఁ బదరోరి

(॥సారె॥)
మొదల నే నెరఁగక మోసపోతిఁగాకనే
కదిసి యేపొద్దు వద్దఁ గాచుకుండనా
యిది మింగినకడికి యింకఁ జవులెంచనేల
చెదర నీపంతమెల్లఁ జెల్లెఁజెల్లెఁ బదరోరి

(॥సారె॥)
సిగ్గులెల్లఁ దీరెఁదీరె శ్రీవేంకటేశుఁడ నేఁడు
వెగ్గళమై నీనాసంది వింతలేలరా
దగ్గరి కూడినమీఁద తలపోఁతలింకనేల నే
నగ్గలమై నీ నా కోపమారెఁదేరెఁ బదరోరి

(||pallavi||)
sārĕsārĕgunu nela jaṁpumām̐ṭalu
ārĕm̐ derĕm̐ badarori āraḍai tim̐ku(tim̐ka?)nu

(||sārĕ||)
āḍarādu dŏravani āḍagunnam̐ bodu ninnu
sūḍam̐ jūḍa nīmovela sukkalāyarā
toḍa nem̐goridi vĕṁṭa tŏḍugulainaṭlāya nī
jāḍalĕllam̐ gaṁṭi viṁṭi sālum̐jālum̐ badarori

(||sārĕ||)
mŏdala ne nĕram̐gaga mosabodim̐gāgane
kadisi yebŏddu vaddam̐ gāsuguṁḍanā
yidi miṁginagaḍigi yiṁkam̐ javulĕṁchanela
sĕdara nībaṁtamĕllam̐ jĕllĕm̐jĕllĕm̐ badarori

(||sārĕ||)
siggulĕllam̐ dīrĕm̐dīrĕ śhrīveṁkaḍeśhum̐ḍa nem̐ḍu
vĕggaḽamai nīnāsaṁdi viṁtalelarā
daggari kūḍinamīm̐da talabom̐taliṁkanela ne
naggalamai nī nā kobamārĕm̐derĕm̐ badarori