Saaresaare nannamta jarayagure

సారెసారె నన్నంత జరయకురే
Language

(॥పల్లవి॥)
సారెసారె నన్నంత జరయకురే
మేరతో నా పతియట మేలు మఱచీనా

(॥సారె ॥)
తానే వచ్చీఁగాని తడవకురే కొంత
నానితేనే మెత్తనౌను నయగారాలు
పోనీపోనీవే అంతపొదుగకురే
పూనిపూచినవిరులు పూఁపలు గాకుండునా

(॥సారె ॥)
కూడీకూడీఁగాని కొసరకురే కొంత
వాడితేను చవులౌను వలపైనాను
నాడెనాడె మొక్కె నవ్వకురే
వేడుక చంద్రోదయము వెన్నెల లేకుండునా

(॥సారె॥)
వుండీనుండీఁగాని వొరయకురే
కొండలైనఁ గోట్లవును గుట్టుగలితే
దండి శ్రీవేంకటపతి తానే విచ్చేసి కూడె
మెండుగా మెరచినందు మేఘము లేకుండునా

(||pallavi||)
sārĕsārĕ nannaṁta jarayagure
merado nā padiyaḍa melu maṟasīnā

(||sārĕ ||)
tāne vachchīm̐gāni taḍavagure kŏṁta
nānidene mĕttanaunu nayagārālu
ponībonīve aṁtabŏdugagure
pūnibūsinavirulu pūm̐palu gāguṁḍunā

(||sārĕ ||)
kūḍīgūḍīm̐gāni kŏsaragure kŏṁta
vāḍidenu savulaunu valabainānu
nāḍĕnāḍĕ mŏkkĕ navvagure
veḍuga saṁdrodayamu vĕnnĕla leguṁḍunā

(||sārĕ||)
vuṁḍīnuṁḍīm̐gāni vŏrayagure
kŏṁḍalainam̐ goṭlavunu guṭṭugalide
daṁḍi śhrīveṁkaḍabadi tāne vichchesi kūḍĕ
mĕṁḍugā mĕrasinaṁdu meghamu leguṁḍunā