Saarenele jagadamu saarenele sanamgulu

సారెనేలే జగడము సారెనేలే సణఁగులు
Language

(॥పల్లవి॥)
సారెనేలే జగడము సారెనేలే సణఁగులు
సారెనేలే పతితోఁ బంతము సారెనేలే

(॥సారె॥)
పెదవుల గొణఁగుచు బీరములాడుచు
కొదలుఁదిట్లనే కొసరుచును

(॥సారె॥)
సెలవుల నవ్వేవు చేతులు చాఁచేవు
సళుపుఁజూపులనె చల్లేవు

(॥సారె॥)
చిడుముడిపడకువె శ్రీవేంకటపతి
కడపరాయఁడయి కయికొనెను

(||pallavi||)
sārĕnele jagaḍamu sārĕnele saṇam̐gulu
sārĕnele padidom̐ baṁtamu sārĕnele

(||sārĕ||)
pĕdavula gŏṇam̐gusu bīramulāḍusu
kŏdalum̐diṭlane kŏsarusunu

(||sārĕ||)
sĕlavula navvevu sedulu sām̐sevu
saḽubum̐jūbulanĕ sallevu

(||sārĕ||)
siḍumuḍibaḍaguvĕ śhrīveṁkaḍabadi
kaḍabarāyam̐ḍayi kayigŏnĕnu