Saaregu naanavettagu samgadi gaadu

సారెకు నానవెట్టకు సంగతి గాదు
Language

(॥పల్లవి॥)
సారెకు నానవెట్టకు సంగతి గాదు
మారుమాట నే నేర మర్మమింతేకాని

(॥సారె॥)
చిత్తమెట్టున్నదో నీకు సిగ్గువడుందాన నేను
అత్తి నీవూ నాపెఁ గూడినది చూచితి
యిత్తల మగవాఁడవు యేమైనా నమరు నీకు
రుత్తనవ్వే వచ్చీ నాకు రోసమేమీ లేదు

(॥సారె॥)
తగవెట్టున్నదో నీకు దయవుట్టీ నాకైతే
తెగువతో మీ ఇద్దరిదిక్కునుఁ జూచి
అగవడ్డదొరవు నీ వన్నియుఁ జెల్లు నీకు
మొగమోటే మించె నాకు మోసమేమీ లేదు

(॥సారె॥)
వెఱగెట్టాయనో నీకు వేడుకవుట్టెను నాకు
నెఱి మీభావ మెఱిఁగి నేఁ గూడితి
వెఱుపేమీ లేదు శ్రీ వేంకటేశుఁడవు నీవు
తఱి నామతి గరఁగె తక్కువేమీ లేదు

(||pallavi||)
sārĕgu nānavĕṭṭagu saṁgadi gādu
mārumāḍa ne nera marmamiṁtegāni

(||sārĕ||)
sittamĕṭṭunnado nīgu sigguvaḍuṁdāna nenu
atti nīvū nābĕm̐ gūḍinadi sūsidi
yittala magavām̐ḍavu yemainā namaru nīgu
ruttanavve vachchī nāgu rosamemī ledu

(||sārĕ||)
tagavĕṭṭunnado nīgu dayavuṭṭī nāgaide
tĕguvado mī iddaridikkunum̐ jūsi
agavaḍḍadŏravu nī vanniyum̐ jĕllu nīgu
mŏgamoḍe miṁchĕ nāgu mosamemī ledu

(||sārĕ||)
vĕṟagĕṭṭāyano nīgu veḍugavuṭṭĕnu nāgu
nĕṟi mībhāva mĕṟim̐gi nem̐ gūḍidi
vĕṟubemī ledu śhrī veṁkaḍeśhum̐ḍavu nīvu
taṟi nāmadi garam̐gĕ takkuvemī ledu