సారెకు మగనాలి సంగాత మిది ఱట్టు చందమామా
(॥పల్లవి॥)
సారెకు మగనాలి సంగాత మిది ఱట్టు చందమామా - నీవు
చేరి దగ్గరితే చీఁకటితప్పవును చందమామా
(॥సారెకు॥)
సందెకాడ నీ చాయలు చూపేవు చందమామా, బూమి
నిందలు గట్టేరు నిన్నుఁ జూచితేను చందమామా,
విందుల నీ రాక వెల్లివిరాయను చందమామా, నీవు
ముందు నానాటికి మోసపోకువయ్య చందమామా,
(॥సారెకు॥)
సరి నేల నీ మేను చంద్రవంక లాయ చందమామా, నీ
తిరిగే తిమ్మట లెల్లా దిక్కుల కెక్కెను చందమామా,
వెరవున నీ వాకె వేగుఁజుక్క లైరి చందమామా, నీ
యిరవు కొండమీఁది యిక్కువ నుండ వో చందమామా,
(॥సారెకు॥)
కళలైన నీ మోము కందువాడ నేల చందమామా, మావా
రలిగి ని న్నొకటి పదారుగఁ జెప్పేరు చందమామా
పొలుపు నీ భావము పులు గరయఁగఁ జిక్కె చందమామా, నిన్ను
నిలువునఁ బట్టిచ్చే నీటిలోపలిచొప్పుచందమామా
(॥సారెకు॥)
కౌఁగిట శ్రీవేంకటతివైనట్టి చందమామా, నన్నుఁ
గాఁగి కూడితివి కదలనీకవో చందమామా,
పాఁగిన చెమటల పాలజలనిధి చందమామా, యింక
దాఁగ నేల నీవు దక్కితి విదె నాకు చందమామా
(||pallavi||)
sārĕgu maganāli saṁgāda midi ṟaṭṭu saṁdamāmā - nīvu
seri daggaride sīm̐kaḍidappavunu saṁdamāmā
(||sārĕgu||)
saṁdĕgāḍa nī sāyalu sūbevu saṁdamāmā, būmi
niṁdalu gaṭṭeru ninnum̐ jūsidenu saṁdamāmā,
viṁdula nī rāga vĕllivirāyanu saṁdamāmā, nīvu
muṁdu nānāḍigi mosaboguvayya saṁdamāmā,
(||sārĕgu||)
sari nela nī menu saṁdravaṁka lāya saṁdamāmā, nī
tirige timmaḍa lĕllā dikkula kĕkkĕnu saṁdamāmā,
vĕravuna nī vāgĕ vegum̐jukka lairi saṁdamāmā, nī
yiravu kŏṁḍamīm̐di yikkuva nuṁḍa vo saṁdamāmā,
(||sārĕgu||)
kaḽalaina nī momu kaṁduvāḍa nela saṁdamāmā, māvā
raligi ni nnŏgaḍi padārugam̐ jĕpperu saṁdamāmā
pŏlubu nī bhāvamu pulu garayam̐gam̐ jikkĕ saṁdamāmā, ninnu
niluvunam̐ baṭṭichche nīḍilobalisŏppusaṁdamāmā
(||sārĕgu||)
kaum̐giḍa śhrīveṁkaḍadivainaṭṭi saṁdamāmā, nannum̐
gām̐gi kūḍidivi kadalanīgavo saṁdamāmā,
pām̐gina sĕmaḍala pālajalanidhi saṁdamāmā, yiṁka
dām̐ga nela nīvu dakkidi vidĕ nāgu saṁdamāmā