Saare vinnabamu lela savulu vuttimcha nela

సారె విన్నపము లేల చవులు వుట్టించ నేల
Language

(॥పల్లవి॥)
సారె విన్నపము లేల చవులు వుట్టించ నేల
దార దప్పకుండే జాణతన మింతే యిఁకనూ

(॥సారె॥)
నావలె వలచివట్టి నాతి నీకుఁ గలదా
ఆవల నీవల నే నాడుకోఁ గాక
నీవల్లఁ గడ మున్నదా నెరజాణతనమందు
బావభేదములలోని భాగ్య మింతే కాక

(॥సారె॥)
యింత నీతో నవ్వెటియింతి నీ కొకతె యేది
వింతగా నీపై వళకు వేయఁ గాక
చెంత నీచేసినమేలు చెప్పితే నటువంటిదే
కొంత గొంత కూడేవేళ గుణ మింతే యిఁకను

(॥సారె॥)
నిన్ను నేఁ గూడినరితి నేరుచునా యెవ్వ తైన
పన్ని నిన్ను నే నిట్టే పంగించఁ గాక
యిన్నిటా శ్రీవెంకటేశ యిటు నన్నుఁ గూడితివి
మున్నిటివెనకల యీ ముచ్చటలే యిఁకను

(||pallavi||)
sārĕ vinnabamu lela savulu vuṭṭiṁcha nela
dāra dappaguṁḍe jāṇadana miṁte yim̐kanū

(||sārĕ||)
nāvalĕ valasivaṭṭi nādi nīgum̐ galadā
āvala nīvala ne nāḍugom̐ gāga
nīvallam̐ gaḍa munnadā nĕrajāṇadanamaṁdu
bāvabhedamulaloni bhāgya miṁte kāga

(||sārĕ||)
yiṁta nīdo navvĕḍiyiṁti nī kŏgadĕ yedi
viṁtagā nībai vaḽagu veyam̐ gāga
sĕṁta nīsesinamelu sĕppide naḍuvaṁṭide
kŏṁta gŏṁta kūḍeveḽa guṇa miṁte yim̐kanu

(||sārĕ||)
ninnu nem̐ gūḍinaridi nerusunā yĕvva taina
panni ninnu ne niṭṭe paṁgiṁcham̐ gāga
yinniḍā śhrīvĕṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
munniḍivĕnagala yī muchchaḍale yim̐kanu