సారె వేసరించ నేల చప్పని వలపు లేల
(॥పల్లవి॥)
సారె వేసరించ నేల చప్పని వలపు లేల
మేరతో నీవు సేసినమేలు నాకు జాలదా
(॥సారె॥)
దిక్కు లెల్లాఁ దిరిగాడి దీనింటికి రానని
అక్కరతో వత్తువుగా అదె చాలును
గక్కన నన్ను మఱచి కన్నపుడే నా యెడకు
యిక్కడ మొకమోడుదు విది చాలదా
(॥సారె॥)
యిందరికి సొమ్ము లెల్లా నిచ్చి నన్నుఁ దలఁచుక
అంది నన్ను వెద కిత్తు వది చాలును
ముందువారితోడ నవ్వి ముంచి నాతో నవ్వ నని
యిందు నన్ను దయఁ జూతు విది చాలదా
(॥సారె॥)
కాంతల నందరిఁ గడి కడు మానాపతి నని
అంతలో నన్నుఁ గూడితి వది చాలును
యింతటి శ్రీవేంకటేశ యిప్పుడు నేనే నీవై
యెంత కెంత బుజ్జగించే విది చాలదా
(||pallavi||)
sārĕ vesariṁcha nela sappani valabu lela
merado nīvu sesinamelu nāgu jāladā
(||sārĕ||)
dikku lĕllām̐ dirigāḍi dīniṁṭigi rānani
akkarado vattuvugā adĕ sālunu
gakkana nannu maṟasi kannabuḍe nā yĕḍagu
yikkaḍa mŏgamoḍudu vidi sāladā
(||sārĕ||)
yiṁdarigi sŏmmu lĕllā nichchi nannum̐ dalam̐suga
aṁdi nannu vĕda kittu vadi sālunu
muṁduvāridoḍa navvi muṁchi nādo navva nani
yiṁdu nannu dayam̐ jūdu vidi sāladā
(||sārĕ||)
kāṁtala naṁdarim̐ gaḍi kaḍu mānābadi nani
aṁtalo nannum̐ gūḍidi vadi sālunu
yiṁtaḍi śhrīveṁkaḍeśha yippuḍu nene nīvai
yĕṁta kĕṁta bujjagiṁche vidi sāladā