సారె వేరేపను లేడ సంతోసమే కాక
(॥పల్లవి॥)
సారె వేరేపను లేడ సంతోసమే కాక
తారుకాణేల విభుఁడ తగులమే కాక
(॥సారె॥)
మనసుగలసినచో మరి కోప మేడది
యెనసి యేమి సేసినా యింపులే కాక
చనవుగలుగుచోట సారె వెరపేడది
చెనకిచేఁతలెల్లఁ జెల్లుబడే కాక
(॥సారె॥)
సరివలచినచోట చంచలము లేడవి
తరితీవులఁ గరఁగేతములే కాక
అరుదందిచూచుచోట నడ్డాఁక లేడవి
మురిపెపుఁబ్రమములముచ్చటలే కాక
(॥సారె॥)
యిచ్చగించియున్నచోట యెడమాఁట లేడవి
పచ్చిగాఁ గూడినయట్టిపగటే కాక
అచ్చపు శ్రీవేంకటేశ అప్పుడే నన్నేలితివి
తచ్చన లిన్నఁకనేవి తనియుటే కాక
(||pallavi||)
sārĕ verebanu leḍa saṁtosame kāga
tārugāṇela vibhum̐ḍa tagulame kāga
(||sārĕ||)
manasugalasinaso mari koba meḍadi
yĕnasi yemi sesinā yiṁpule kāga
sanavugalugusoḍa sārĕ vĕrabeḍadi
sĕnagisem̐talĕllam̐ jĕllubaḍe kāga
(||sārĕ||)
sarivalasinasoḍa saṁchalamu leḍavi
taridīvulam̐ garam̐gedamule kāga
arudaṁdisūsusoḍa naḍḍām̐ka leḍavi
muribĕbum̐bramamulamuchchaḍale kāga
(||sārĕ||)
yichchagiṁchiyunnasoḍa yĕḍamām̐ṭa leḍavi
pachchigām̐ gūḍinayaṭṭibagaḍe kāga
achchabu śhrīveṁkaḍeśha appuḍe nannelidivi
tachchana linnam̐kanevi taniyuḍe kāga