Saare valabamdaribaim jallusunnaamdu

సారె వలపందరిపైఁ జల్లుచున్నాఁడు
Language

(॥పల్లవి॥)
సారె వలపందరిపైఁ జల్లుచున్నాఁడు
తీరుగా సరసమాడి తిల్లగోవిందరాజు

(॥॥)
భరితమై మేడలోనఁ బవ్వళించి వున్నవాఁడు
తరుణులతో నవ్వుతా నున్నాఁడు
పరగ నందరిచేత పాట వింటానున్నవాఁడు
తెర దీసుకున్నవాఁడు తిల్లగోవిందరాజు

(॥॥)
సేసపాలశిరసున సిగ్గుతోడ నున్నవాఁడు
ఆసపాటుచూపులచాయల నున్నాఁడు
బాసికపుసతులపై పాదాలు చాఁచుకున్నాడు
తీసిపెట్టుగానితమిఁ దిల్లగోవిందరాజు

(॥॥)
బావపురతులఁ గూడి పంతముతో నున్నవాఁడు
శ్రీవనిత భూవనితఁ జేసుకున్నాఁడు
వావు లిందరికిఁ జెప్పి వన్నెకాఁడై పొందినాఁడు
దేవుఁడు శ్రీ వేంకటాద్రి తిల్లగోవిందరాజు

(||pallavi||)
sārĕ valabaṁdaribaim̐ jallusunnām̐ḍu
tīrugā sarasamāḍi tillagoviṁdarāju

(||||)
bharidamai meḍalonam̐ bavvaḽiṁchi vunnavām̐ḍu
taruṇulado navvudā nunnām̐ḍu
paraga naṁdariseda pāḍa viṁṭānunnavām̐ḍu
tĕra dīsugunnavām̐ḍu tillagoviṁdarāju

(||||)
sesabālaśhirasuna siggudoḍa nunnavām̐ḍu
āsabāḍusūbulasāyala nunnām̐ḍu
bāsigabusadulabai pādālu sām̐sugunnāḍu
tīsibĕṭṭugānidamim̐ dillagoviṁdarāju

(||||)
bāvaburadulam̐ gūḍi paṁtamudo nunnavām̐ḍu
śhrīvanida bhūvanidam̐ jesugunnām̐ḍu
vāvu liṁdarigim̐ jĕppi vannĕgām̐ḍai pŏṁdinām̐ḍu
devum̐ḍu śhrī veṁkaḍādri tillagoviṁdarāju