సారె సారె మీరేల సందడిఁ బెట్టేరే
(॥పల్లవి॥)
సారె సారె మీరేల సందడిఁ బెట్టేరే
మారుని మాయలు నేఁడు మందులఁ బొయ్యీనా
(॥॥)
వలపు వెంచఁగఁబోతే వంతులకుఁ జవులవునా
అలవాని పొందు మానుమని యేల చెప్పేరే
తలఁ పాతని మీఁదటఁ దనువు యీడనే యింతే
యెలిమి మీరేమన్నా నిఁక మానఁబొయ్యేనా
(॥॥)
మనసునఁ బాలు దాగ మఱి కడుపు నిండునా
పొనిగేల యెడమాటఁ బొద్దువుచ్చేరే
కనుచూ పాతనిమీఁద కాఁక లివె నామీఁద
వెనక మీరెమన్నా వినఁబొయ్యేనా
(॥॥)
మాటలు విసుకఁబోతే మాపుదాఁకా మెత్తనౌనా
పూఁట వూఁట నాకేల బుద్దిచెప్పేరే
యీటులేని శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
మేటుల నేఁడిఁకనేల మీరే నేఁగానా
(||pallavi||)
sārĕ sārĕ mīrela saṁdaḍim̐ bĕṭṭere
māruni māyalu nem̐ḍu maṁdulam̐ bŏyyīnā
(||||)
valabu vĕṁcham̐gam̐bode vaṁtulagum̐ javulavunā
alavāni pŏṁdu mānumani yela sĕppere
talam̐ pādani mīm̐daḍam̐ danuvu yīḍane yiṁte
yĕlimi mīremannā nim̐ka mānam̐bŏyyenā
(||||)
manasunam̐ bālu dāga maṟi kaḍubu niṁḍunā
pŏnigela yĕḍamāḍam̐ bŏdduvuchchere
kanusū pādanimīm̐da kām̐ka livĕ nāmīm̐da
vĕnaga mīrĕmannā vinam̐bŏyyenā
(||||)
māḍalu visugam̐bode mābudām̐kā mĕttanaunā
pūm̐ṭa vūm̐ṭa nāgela buddisĕppere
yīḍuleni śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
meḍula nem̐ḍim̐kanela mīre nem̐gānā