సారె సారె మన్నించేవు చనవు లిచ్చేవు నాకు
(॥పల్లవి॥)
సారె సారె మన్నించేవు చనవు లిచ్చేవు నాకు
యీ రీతి నీ సతులలో నెవ్వరిఁ బోలుదును
(॥॥)
చక్కెరమాఁటలాడి సాదించు నిన్ను నాపె
మిక్కిలి సేవలు సేసి మెప్పించును
చిక్కనిచన్నులు చూపి చిత్తమెల్లాఁగరగించు
ఇక్కడ నన్నుఁ జెనకే వేమిబాఁతి నేను
(॥॥)
సన్నలనే మోవిచూపు చవులు రేఁచు నాపె
వన్నెలుగా నవ్వునవ్వి వలపించును
కన్నుల మొక్కులు మొక్కి కళలెల్లాఁ బుట్చించు
ఇన్నిటా నన్నుఁ బొగడే వెంతదాన నేను
(॥॥)
ఆయములంటు నిన్ను నలమేలుమంగ యాపె
చాయల నీవురమెక్కి జట్టిగొనును
పాయకుండు నిన్నేపొద్దు బత్తితో శ్రీ వేంకటేశ
యీయెడ నన్నేలితివి యితవైతి నేను
(||pallavi||)
sārĕ sārĕ manniṁchevu sanavu lichchevu nāgu
yī rīdi nī sadulalo nĕvvarim̐ boludunu
(||||)
sakkĕramām̐ṭalāḍi sādiṁchu ninnu nābĕ
mikkili sevalu sesi mĕppiṁchunu
sikkanisannulu sūbi sittamĕllām̐garagiṁchu
ikkaḍa nannum̐ jĕnage vemibām̐ti nenu
(||||)
sannalane movisūbu savulu rem̐su nābĕ
vannĕlugā navvunavvi valabiṁchunu
kannula mŏkkulu mŏkki kaḽalĕllām̐ buṭchiṁchu
inniḍā nannum̐ bŏgaḍe vĕṁtadāna nenu
(||||)
āyamulaṁṭu ninnu nalamelumaṁga yābĕ
sāyala nīvuramĕkki jaṭṭigŏnunu
pāyaguṁḍu ninnebŏddu battido śhrī veṁkaḍeśha
yīyĕḍa nannelidivi yidavaidi nenu