సారె సారె మమ్మునేల సాకిరివెట్టేవు నీవు
(॥పల్లవి॥)
సారె సారె మమ్మునేల సాకిరివెట్టేవు నీవు
ఆరజముగా నిన్ను నౌఁగాదనఁగలమా
(॥సారె॥)
చెప్పేటి మాటలెల్లాను చెవులొగ్గి వింటగాక
తిప్పిచెప్పి నీ గుణాలు తిద్దఁగలమా
అప్పటప్పటికి యిచ్చలాడ నోపుదుముగాక
చొప్పులెత్తి నిన్నింతేసి సోదించఁగలమా
(॥సారె॥)
సూటిగా నీ సేసేచేఁత చూడఁగల మింతేకాక
సాటికి బేటికి నిన్ను సాగించేమా
యీటువెట్టి వొకమాటు యెచ్చరించు టింతే కాక
గాఁటమైన నీ మనసు కరఁగించఁగలమా
(॥సారె॥)
నంటున నీ వునికికి నవ్వుటే తగవుగాక
అంటిముట్టి యేమైనా నిన్నాడఁగలమా
ఇంటిలో శ్రీవేంకటేశ యింతి నీవు గూడితివి
జంటలమిమ్మిద్దరి మొచ్చక మానఁగలమా
(||pallavi||)
sārĕ sārĕ mammunela sāgirivĕṭṭevu nīvu
ārajamugā ninnu naum̐gādanam̐galamā
(||sārĕ||)
sĕppeḍi māḍalĕllānu sĕvulŏggi viṁṭagāga
tippisĕppi nī guṇālu tiddam̐galamā
appaḍappaḍigi yichchalāḍa nobudumugāga
sŏppulĕtti ninniṁtesi sodiṁcham̐galamā
(||sārĕ||)
sūḍigā nī sesesem̐ta sūḍam̐gala miṁtegāga
sāḍigi beḍigi ninnu sāgiṁchemā
yīḍuvĕṭṭi vŏgamāḍu yĕchchariṁchu ṭiṁte kāga
gām̐ṭamaina nī manasu karam̐giṁcham̐galamā
(||sārĕ||)
naṁṭuna nī vunigiki navvuḍe tagavugāga
aṁṭimuṭṭi yemainā ninnāḍam̐galamā
iṁṭilo śhrīveṁkaḍeśha yiṁti nīvu gūḍidivi
jaṁṭalamimmiddari mŏchchaga mānam̐galamā