Saare ninnu vesarimcha samgade naagu

సారె నిన్ను వేసరించ సంగతే నాకు
Language

(॥పల్లవి॥)
సారె నిన్ను వేసరించ సంగతే నాకు
మారాడ నే నాలిసొమ్ము మగనిదె కాదా

(॥సారె॥)
నిన్ను వేగిరించేనా నీవె యెఱఁగవా
కన్నుల మొక్కితేఁ దానె కరఁగేవు
చన్నులె గొప్పలు గాని సరి నడుము బడలె
విన్నపము లిఁక నేల వింతదానఁ గాను

(॥సారె॥)
చలము సాధించేనా జాణఁడవు గావా
నిటుచుండఁగాఁ గరుణించేవు నీవె
లలిఁ గొప్ప గొప్పగాని లాచి మోము చిన్నఁబోయ
బలిమి చూపఁగ నీతో బంతగత్తెనా

(॥సారె॥)
నింద వేసేదాననా నీవు శ్రీవెంకటేశుఁడ
వందాలు సేసుకోఁగానె ఆదరించేవు
కందవకన్నులె గొప్ప గాని పాదాలు సన్నాలు
మందలించి నీతో మారు మలయంగఁ గలనా

(||pallavi||)
sārĕ ninnu vesariṁcha saṁgade nāgu
mārāḍa ne nālisŏmmu maganidĕ kādā

(||sārĕ||)
ninnu vegiriṁchenā nīvĕ yĕṟam̐gavā
kannula mŏkkidem̐ dānĕ karam̐gevu
sannulĕ gŏppalu gāni sari naḍumu baḍalĕ
vinnabamu lim̐ka nela viṁtadānam̐ gānu

(||sārĕ||)
salamu sādhiṁchenā jāṇam̐ḍavu gāvā
niḍusuṁḍam̐gām̐ garuṇiṁchevu nīvĕ
lalim̐ gŏppa gŏppagāni lāsi momu sinnam̐boya
balimi sūbam̐ga nīdo baṁtagattĕnā

(||sārĕ||)
niṁda vesedānanā nīvu śhrīvĕṁkaḍeśhum̐ḍa
vaṁdālu sesugom̐gānĕ ādariṁchevu
kaṁdavagannulĕ gŏppa gāni pādālu sannālu
maṁdaliṁchi nīdo māru malayaṁgam̐ galanā