సారె నిన్నలమేల్మంగ జవ్వనవనమునను
(॥పల్లవి॥)
సారె నిన్నలమేల్మంగ జవ్వనవనమునను
చేరి యవధరింతు(చు?) విచ్చే(య)వయ్య జాజర
(॥॥)
వసంతకాలము వచ్చే వనితమోవి ఇగిర్చె
కొసరేయెలుఁగులను కోవిల గూసె
ముసరీఁ జూపులతేంట్లు మోతుగై వలపు వూచె
రసికత నాడుదువు రావయ్య జాజర
(॥॥)
పున్నమవెన్నలగానె కనుఁగలువలు విచ్చె
పిన్నలై చన్నుల నేటిపిందెలు వుట్టె
సన్నపుఁ జెమటాలను జాలువారెఁ బన్నీరు
చెన్నమీర నాడుదు విచ్చేయవయ్య జాజర
(॥॥)
మరుఁడు విల్లందుకొనె మచ్చికలు గూడఁజేసె
పొరి పొరి సిగ్గులనేపుప్పొడి రాలె
ఇరవై శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
సరుగ మీమీఁద మీరే చల్లరయ్య జాజర
(||pallavi||)
sārĕ ninnalamelmaṁga javvanavanamunanu
seri yavadhariṁtu(su?) vichche(ya)vayya jājara
(||||)
vasaṁtagālamu vachche vanidamovi igirsĕ
kŏsareyĕlum̐gulanu kovila gūsĕ
musarīm̐ jūbuladeṁṭlu modugai valabu vūsĕ
rasigada nāḍuduvu rāvayya jājara
(||||)
punnamavĕnnalagānĕ kanum̐galuvalu vichchĕ
pinnalai sannula neḍibiṁdĕlu vuṭṭĕ
sannabum̐ jĕmaḍālanu jāluvārĕm̐ bannīru
sĕnnamīra nāḍudu vichcheyavayya jājara
(||||)
marum̐ḍu villaṁdugŏnĕ machchigalu gūḍam̐jesĕ
pŏri pŏri siggulanebuppŏḍi rālĕ
iravai śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
saruga mīmīm̐da mīre sallarayya jājara