Saare nettu mechchemu nee jaanadanaalu

సారె నెట్టు మెచ్చేము నీ జాణతనాలు
Language

(॥పల్లవి॥)
సారె నెట్టు మెచ్చేము నీ జాణతనాలు
ఆ రీతుల నవ్వుతానే ఆస రేఁచేవు

(॥సారె॥)
వొద్ద నిలుచుండఁగానే వూరకే ఆపెతోడ
సుద్దులు చెప్పుతానే సోఁక నాడేవు
అద్దో నిమ్మపండు కాను కందుకొంటాఁ జెయి చాఁచి
పెద్దరికములు చూపి పెనఁగులాడేవు

(॥సారె॥)
తివిరి వడ్డించఁగానే తేరకొన నాకెఁ జూచి
చవుల డుగుతాఁ గడు సన్న సేసేవు
అవునయ్యా చేతికి నీళ్ళందిచ్చితే మీఁదఁ జల్లి
చివురుమోవియడిగి సిగ్గు రేఁచేవు

(॥సారె॥)
కొలువు సేయఁగానే కుచ్చి కాఁగిలించుకొని
బలుములు చూపుతానే పచ్చి సేసేవు
అలరి శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
చెలరేఁగి మొక్కఁగానే చెక్కులు నొక్కేవు

(||pallavi||)
sārĕ nĕṭṭu mĕchchemu nī jāṇadanālu
ā rīdula navvudāne āsa rem̐sevu

(||sārĕ||)
vŏdda nilusuṁḍam̐gāne vūrage ābĕdoḍa
suddulu sĕppudāne som̐ka nāḍevu
addo nimmabaṁḍu kānu kaṁdugŏṁṭām̐ jĕyi sām̐si
pĕddarigamulu sūbi pĕnam̐gulāḍevu

(||sārĕ||)
tiviri vaḍḍiṁcham̐gāne teragŏna nāgĕm̐ jūsi
savula ḍugudām̐ gaḍu sanna sesevu
avunayyā sedigi nīḽḽaṁdichchide mīm̐dam̐ jalli
sivurumoviyaḍigi siggu rem̐sevu

(||sārĕ||)
kŏluvu seyam̐gāne kuchchi kām̐giliṁchugŏni
balumulu sūbudāne pachchi sesevu
alari śhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ
sĕlarem̐gi mŏkkam̐gāne sĕkkulu nŏkkevu