Saare naase vellanaadimchamga nela

సారె నాచే వెళ్ళనాడించఁగ నేల
Language

(॥పల్లవి॥)
సారె నాచే వెళ్ళనాడించఁగ నేల
మేరతో నిలుపవయ్య మేటి నీ గుణములు

(॥సారె॥)
కన్నవారిమానములు గనుగొన్న చూపులనే
పన్ని నన్నుఁ జూడకురా పచ్చిరోఁతలు
యిన్నిటా నీ కితవైతే నివి యింకఁ గొలనిలో
కన్నెలకు నీకుఁ దగుఁగాకరి యీ పనులు

(॥సారె॥)
సంగతి నెంగిలిమోవి చవిగొన్న నీ నోట
అంగవించి మాతో మాటలాడకువయ్య
వెంగలి యీపను లెల్ల వేడుకైతే నల్లనాటి
అంగడి కుబ్జకు నీకు నమరు నీచేఁతలు

(॥సారె॥)
అందరివలెనే గోరి నంటకుర నీవు నన్ను
విందవై కూడితివి శ్రీవేంకటేశుఁడ
కెందమ్మిరేకులలోనిగీరలు రుకుమిణిచే
నందుకొన్న యీ నీకు నాకెకునే తగునూ

(||pallavi||)
sārĕ nāse vĕḽḽanāḍiṁcham̐ga nela
merado nilubavayya meḍi nī guṇamulu

(||sārĕ||)
kannavārimānamulu ganugŏnna sūbulane
panni nannum̐ jūḍagurā pachchirom̐talu
yinniḍā nī kidavaide nivi yiṁkam̐ gŏlanilo
kannĕlagu nīgum̐ dagum̐gāgari yī panulu

(||sārĕ||)
saṁgadi nĕṁgilimovi savigŏnna nī noḍa
aṁgaviṁchi mādo māḍalāḍaguvayya
vĕṁgali yībanu lĕlla veḍugaide nallanāḍi
aṁgaḍi kubjagu nīgu namaru nīsem̐talu

(||sārĕ||)
aṁdarivalĕne gori naṁṭagura nīvu nannu
viṁdavai kūḍidivi śhrīveṁkaḍeśhum̐ḍa
kĕṁdammiregulalonigīralu rugumiṇise
naṁdugŏnna yī nīgu nāgĕgune tagunū