సారె నాటి సుద్ది నేఁడు చవులనవే
(॥పల్లవి॥)
సారె నాటి సుద్ది నేఁడు చవులనవే
కోరి నేఁడు రాజైతే కూరిమి వోదనవే
(॥॥)
మంచముపై నన్నమాట మఱవకుమనవే
లంచపు నామోవి తలఁచుకొమ్మనవే
అంచల నాకొప్పు దువ్వె నది నీవడుగవే
యెంచ నేఁడు తా దొరైతే నేమిదోస మనవే
(॥॥)
దాకొన్నమోవిగంటి తానే చూచుకొమ్మనవే
లేకలు ముంజూరు నిండె లెక్కించుకొమ్మనవే
ఆకు మడి చిచ్చినది ఆనవాలాయననవే
యీకడఁ బెద్దరికాన కేమిదప్పె ననవే
(॥॥)
నాలత్తుకరేక చిన్నినామమాయ ననవే
చాలుఁజాలు నిఁకనేల సటలనవే
యేలెను శ్రీ వేంకటేశుఁ డిదె నన్నుఁగాఁగిటను
పోలించి తా దేవుఁడైతే పొందు మానదనవే
(||pallavi||)
sārĕ nāḍi suddi nem̐ḍu savulanave
kori nem̐ḍu rājaide kūrimi vodanave
(||||)
maṁchamubai nannamāḍa maṟavagumanave
laṁchabu nāmovi talam̐sugŏmmanave
aṁchala nāgŏppu duvvĕ nadi nīvaḍugave
yĕṁcha nem̐ḍu tā dŏraide nemidosa manave
(||||)
dāgŏnnamovigaṁṭi tāne sūsugŏmmanave
legalu muṁjūru niṁḍĕ lĕkkiṁchugŏmmanave
āgu maḍi sichchinadi ānavālāyananave
yīgaḍam̐ bĕddarigāna kemidappĕ nanave
(||||)
nālattugarega sinnināmamāya nanave
sālum̐jālu nim̐kanela saḍalanave
yelĕnu śhrī veṁkaḍeśhum̐ ḍidĕ nannum̐gām̐giḍanu
poliṁchi tā devum̐ḍaide pŏṁdu mānadanave