Saare jaarumbayyadado sadinela vela vraasi

సారె జారుఁబయ్యదతో సతినేల వేల వ్రాసి
Language

(॥పల్లవి॥)
సారె జారుఁబయ్యదతో సతినేల వేల వ్రాసి
గారవించి బుద్దిచెప్పి కైకొనరాదా

(॥సారె॥)
చిత్తములోపలిమాట చెప్పి సిగ్గువడి యదె
జొత్తువలెఁ జెమరించె సదతిమేను
చిత్తజగురుఁడ యాకెఁ జెక్కు నొక్కు సేదదేర్చి
అత్తుకొని నీవు మాట లడుగఁగరాదా

(॥సారె॥)
కూడినట్టి మొగమోట కూరిమి గొసరలేక
వాడు మోమై తలవంచె వనిత నేఁడు
నీడకుఁ జేవట్టి తీసి నిండుఁగాఁగిట నదిమి
వేడక నవ్వు నవ్వించి వింతసేయురాదా

(॥సారె॥)
రతివేళ తమకాన రాఁపు నిన్నుఁ జేయలేక
మతి మఱచి చొక్కెను మగువ నేఁడు
ఇతవై శ్రీ వేంకటేశ యిక్కువఁ గూడితి విట్టె
మితిమీర నాకెచేత మెప్పించుకోరాదా

(||pallavi||)
sārĕ jārum̐bayyadado sadinela vela vrāsi
gāraviṁchi buddisĕppi kaigŏnarādā

(||sārĕ||)
sittamulobalimāḍa sĕppi sigguvaḍi yadĕ
jŏttuvalĕm̐ jĕmariṁchĕ sadadimenu
sittajagurum̐ḍa yāgĕm̐ jĕkku nŏkku sedadersi
attugŏni nīvu māḍa laḍugam̐garādā

(||sārĕ||)
kūḍinaṭṭi mŏgamoḍa kūrimi gŏsaralega
vāḍu momai talavaṁchĕ vanida nem̐ḍu
nīḍagum̐ jevaṭṭi tīsi niṁḍum̐gām̐giḍa nadimi
veḍaga navvu navviṁchi viṁtaseyurādā

(||sārĕ||)
radiveḽa tamagāna rām̐pu ninnum̐ jeyalega
madi maṟasi sŏkkĕnu maguva nem̐ḍu
idavai śhrī veṁkaḍeśha yikkuvam̐ gūḍidi viṭṭĕ
midimīra nāgĕseda mĕppiṁchugorādā