Saarabu navvuladodi sadagaamdaa

సారపు నవ్వులతోడి సటకాఁడా
Language

(॥పల్లవి॥)
సారపు నవ్వులతోడి సటకాఁడా
పోరచి పొరుగులనే బుద్దిచెప్పరా

(॥సార॥)
చలము సాదించేనంటే చవి చాల దించుకంత
వలపు చల్లేనంటే వాసి చాలదు
బలిమి చూపేనంటే పాడిపంతము చాలదు
యెలమి నీతోడిపొందు లెట్టుసేతురా

(॥సార॥)
సిగ్గుతోడ నుండేనంటే సెలవులే దెవ్వరికి
దగ్గరేనంటే దంటతనము లేదు
వెగ్గళించేనంటే నీతో విరసమేమియు లేదు
యెగ్గుదప్పులేక సేవ యెట్టుసేతురా

(॥సార॥)
మఱుఁగువ నుండేనంటే మనలో భేద మెఱఁగ
జఱసేనంటేను నీసర వెఱఁగ
గుఱిగా శ్రీవేంకటాద్రి గోవిందరాజ నేఁడు
యెఱుకతోఁ గూడితివి యిఁకనేమి సేతురా

(||pallavi||)
sārabu navvuladoḍi saḍagām̐ḍā
porasi pŏrugulane buddisĕpparā

(||sāra||)
salamu sādiṁchenaṁṭe savi sāla diṁchugaṁta
valabu sallenaṁṭe vāsi sāladu
balimi sūbenaṁṭe pāḍibaṁtamu sāladu
yĕlami nīdoḍibŏṁdu lĕṭṭusedurā

(||sāra||)
siggudoḍa nuṁḍenaṁṭe sĕlavule dĕvvarigi
daggarenaṁṭe daṁṭadanamu ledu
vĕggaḽiṁchenaṁṭe nīdo virasamemiyu ledu
yĕggudappulega seva yĕṭṭusedurā

(||sāra||)
maṟum̐guva nuṁḍenaṁṭe manalo bheda mĕṟam̐ga
jaṟasenaṁṭenu nīsara vĕṟam̐ga
guṟigā śhrīveṁkaḍādri goviṁdarāja nem̐ḍu
yĕṟugadom̐ gūḍidivi yim̐kanemi sedurā