సార దూరఁజాలనూ చలముల కోపనూ
(॥పల్లవి॥)
సార దూరఁజాలనూ చలముల కోపనూ
చేరితి మాచనవోలి చెన్నుని భ్రమలను
(॥సారె॥)
యీడకుఁ బిలుపించెను యేమిసేయుమనీనే
వోడక తనయెదుట నున్నదానను
పాడితో నీట ముంచనీ పాల ముంచనీ తాను
వాడుఁదనవలపులకు లోనైతిని
(॥సారె॥)
మాఁట నన్ను నాడించెను మన నెట్టుదెలిసీనే
యేఁటికైనా నియ్యకొంటి నిదివో నేను
నాఁటిమాఁట చెల్లించీనా నగనీ తెగడనీ
మేఁటిపాయము తనకే మీఁదుగా నె త్తితిని
(॥సారె॥)
కాఁగిట నన్ను నించెను కళదాఁకె నిఁకనేలే
దాఁగక తనకు నిట్టె దక్కితి నేను
వీఁగక శ్రీవేంకటాద్రివిభుఁడు దా నన్నుఁగూడె
యేఁగించనీ రేఁగించనీ యిరవైతి నేను
(||pallavi||)
sāra dūram̐jālanū salamula kobanū
seridi māsanavoli sĕnnuni bhramalanu
(||sārĕ||)
yīḍagum̐ bilubiṁchĕnu yemiseyumanīne
voḍaga tanayĕduḍa nunnadānanu
pāḍido nīḍa muṁchanī pāla muṁchanī tānu
vāḍum̐danavalabulagu lonaidini
(||sārĕ||)
mām̐ṭa nannu nāḍiṁchĕnu mana nĕṭṭudĕlisīne
yem̐ṭigainā niyyagŏṁṭi nidivo nenu
nām̐ṭimām̐ṭa sĕlliṁchīnā naganī tĕgaḍanī
mem̐ṭibāyamu tanage mīm̐dugā nĕ ttidini
(||sārĕ||)
kām̐giḍa nannu niṁchĕnu kaḽadām̐kĕ nim̐kanele
dām̐gaga tanagu niṭṭĕ dakkidi nenu
vīm̐gaga śhrīveṁkaḍādrivibhum̐ḍu dā nannum̐gūḍĕ
yem̐giṁchanī rem̐giṁchanī yiravaidi nenu