Saamu sesinavaamdavu jagajettivi neevu

సాము సేసినవాఁడవు జగజెట్టివి నీవు
Language

(॥పల్లవి॥)
సాము సేసినవాఁడవు జగజెట్టివి నీవు
యీ మగువ నీతోను యింతేసి కోపునా

(॥సాము॥)
చెక్కులేల నొక్కేవు సిగ్గువడీఁ జెలియ
మెుక్కలానఁ జూడఁగాను మోము వంచీని
కక్కసించి కిఁక నీవు కడలేనిజవ్వనిఁ
నిక్కవ లంటి పెనఁగే వింత కోపునా

(॥సాము॥)
చేయి పైనేల వేసేవు చెమరించీఁ గలికి
ఆయము లంటకు వెరగందీ నిట్టె
కాయము చిమ్మిరేఁచకు కడుఁగడుముద్దరాలు
యీయెడ నెంతేసి నవ్వేవింత కోవునా

(॥సాము॥)
అందేల ముట్టేవు మొక్కీ నలమేలుమంగ
సందడిఁ గొంగువట్టకు సన్న సేసీని
యిందుముఖిఁ గూడితివి యింతలో శ్రీవేంకటేశ
యిందరిలో మేలమాడే వింత కోపునా

(||pallavi||)
sāmu sesinavām̐ḍavu jagajĕṭṭivi nīvu
yī maguva nīdonu yiṁtesi kobunā

(||sāmu||)
sĕkkulela nŏkkevu sigguvaḍīm̐ jĕliya
mĕుkkalānam̐ jūḍam̐gānu momu vaṁchīni
kakkasiṁchi kim̐ka nīvu kaḍalenijavvanim̐
nikkava laṁṭi pĕnam̐ge viṁta kobunā

(||sāmu||)
seyi painela vesevu sĕmariṁchīm̐ galigi
āyamu laṁṭagu vĕragaṁdī niṭṭĕ
kāyamu simmirem̐sagu kaḍum̐gaḍumuddarālu
yīyĕḍa nĕṁtesi navveviṁta kovunā

(||sāmu||)
aṁdela muṭṭevu mŏkkī nalamelumaṁga
saṁdaḍim̐ gŏṁguvaṭṭagu sanna sesīni
yiṁdumukhim̐ gūḍidivi yiṁtalo śhrīveṁkaḍeśha
yiṁdarilo melamāḍe viṁta kobunā