చాలురా నీ పొందులు సటలకు వచ్చెనా
(॥పల్లవి॥)
చాలురా నీ పొందులు సటలకు వచ్చెనా
జాలువారేఁ గన్నీళ్లు చక్క నీవుఁ జూడరా
(॥చాలురా॥)
నేను నీవుఁ గూచుండఁగా నిక్కి చూచి జగడించి
నీ నెలఁత యేమన్నా నీవంట గాదా
కానికాని వొట్లతో కదిసితి మిద్దరము
మోనాన నూరకుండితే మొత్తు మంట గాదా
(॥చాలురా॥)
హితవై సరసము నే నిటు నీతో నాడఁగా
సతి జంకించినది నీ సలిగ గాదా
పతిగా సాకిరిమాట పలుకు మంటే నవ్వేవు
మతకానఁ బగ దీర్చేమాయ నీది గాదా
(॥చాలురా॥)
యెకసక్కేనకు నాపై యీటి చూపు చూడఁగాను
మొకమోటాన నుంటే నీ ముద్దులే కాదా
వెకలివై యిద్దరి శ్రీవేంకటేశ కూడఁబట్టి
వొకటఁ గౌఁగిలించితి వొడఁబాటు గాదా
(||pallavi||)
sālurā nī pŏṁdulu saḍalagu vachchĕnā
jāluvārem̐ gannīḽlu sakka nīvum̐ jūḍarā
(||sālurā||)
nenu nīvum̐ gūsuṁḍam̐gā nikki sūsi jagaḍiṁchi
nī nĕlam̐ta yemannā nīvaṁṭa gādā
kānigāni vŏṭlado kadisidi middaramu
monāna nūraguṁḍide mŏttu maṁṭa gādā
(||sālurā||)
hidavai sarasamu ne niḍu nīdo nāḍam̐gā
sadi jaṁkiṁchinadi nī saliga gādā
padigā sāgirimāḍa palugu maṁṭe navvevu
madagānam̐ baga dīrsemāya nīdi gādā
(||sālurā||)
yĕgasakkenagu nābai yīḍi sūbu sūḍam̐gānu
mŏgamoḍāna nuṁṭe nī muddule kādā
vĕgalivai yiddari śhrīveṁkaḍeśha kūḍam̐baṭṭi
vŏgaḍam̐ gaum̐giliṁchidi vŏḍam̐bāḍu gādā