Saalunidi padivelu sarivachchemgaa

చాలునిది పదివేలు సరివచ్చెఁగా
Language

(॥పల్లవి॥)
చాలునిది పదివేలు సరివచ్చెఁగా
తాలిమిఁ జెలులమాఁటే తప్పదాయఁగా

(॥చాలు॥)
అదె నామతి పలచనైనా నాయఁగాని
కదిసితే నీనవ్వు గట్టియాయఁగా
అదన నాచూపు తెల్లనైనా నాయఁగాని
యెదుట నీమోవి యిదె యెఱ్ఱనాయఁగా

(॥చాలు॥)
కడగిననామేను కాఁకైనా నాయఁగాని
చిడుముడి నీచెక్కు చెమరించెఁగా
నడుమనే వేగించినా వేగించితిగాక
తొడరి నీకైతే నిద్ర తొట్టుకొనెఁగా

(॥చాలు॥)
రేఁగుచు నాగోరఁ జిన్న రేకయైనా నాయఁగాని
కాఁగిటినీయాసలైతేఁ గనమాయఁగా
చేగఁదేరెను రతుల శ్రీవేంకటేశ నేఁడు
తోఁగినమనరతులు తులఁదూఁగెఁగా

(||pallavi||)
sālunidi padivelu sarivachchĕm̐gā
tālimim̐ jĕlulamām̐ṭe tappadāyam̐gā

(||sālu||)
adĕ nāmadi palasanainā nāyam̐gāni
kadiside nīnavvu gaṭṭiyāyam̐gā
adana nāsūbu tĕllanainā nāyam̐gāni
yĕduḍa nīmovi yidĕ yĕṭranāyam̐gā

(||sālu||)
kaḍaginanāmenu kām̐kainā nāyam̐gāni
siḍumuḍi nīsĕkku sĕmariṁchĕm̐gā
naḍumane vegiṁchinā vegiṁchidigāga
tŏḍari nīgaide nidra tŏṭṭugŏnĕm̐gā

(||sālu||)
rem̐gusu nāgoram̐ jinna regayainā nāyam̐gāni
kām̐giḍinīyāsalaidem̐ ganamāyam̐gā
segam̐derĕnu radula śhrīveṁkaḍeśha nem̐ḍu
tom̐ginamanaradulu tulam̐dūm̐gĕm̐gā